English | Telugu
ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్... పెళ్లి గురించి మాట్లాడిన హీరో!
Updated : Jun 18, 2023
బాలీవుడ్‌లో యంగెస్ట్ సూపర్‌స్టార్ ఎవరని ఎవరిని అడిగినా చెప్పే పేరు కార్తిక్ ఆర్యన్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటూనే ఉంటారు కార్తిక్. హ్యాష్ ట్యాగ్ ఆస్క్ కార్తిక్ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. అభిమానులతో మాట్లాడటం, వాళ్ల ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు చెప్పడంలో ఓ థ్రిల్ ఉంటుందని అంటారు కార్తిక్ ఆర్యన్.
అలా జరిగిన వారి సంభాషణల్లో ఇటీవల ఓ మంచి విషయం బయటపడింది. మీకు అరేంజ్డ్ మేరేజ్ ఇష్టమా? లవ్ మేరేజ్ ఇష్టమా? అని ఓ ఫ్యాన్ కార్తిక్‌ని ప్రశ్నించారు. అందుకు కార్తిక్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
లవ్ అరేంజ్ చేసిన మేరేజ్ చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు కార్తిక్. ఇదేం ఆన్సర్ బాసూ అని కార్తిక్ ఆర్యన్ తెలివికి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. పెళ్లి కూతురు సిద్ధంగా ఉన్న రోజు, తాను పెళ్లికి రెడీ అని అన్నారు కార్తిక్.
ఆయన నటించిన సత్యప్రేమ్‌కీ కథ సినిమా విడుదలకు సిద్ధమైంది. కియారా హీరోయిన్‌గా నటించిన మూవీ ఇది. ఈ నెల 29న విడుదల కానున్న సత్య ప్రేమ్ కీ కథ మూవీ ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ. సుప్రియ పాథక్ కపూర్, గజ్‌రాజ్ రావు, సిద్ధార్థ్ రంధేరియా, అనూరాధ పటేల్, రాజ్‌పాల్ యాదవ్, నిర్మితే సావంత్, శిక్ష తల్సానియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నదియడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, నమః పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించాయి.