English | Telugu
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పనున్న దీప్‌వీర్!
Updated : Jun 13, 2023
దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అదేదో వాళ్లిద్దరూ విడిపోతున్నారనో, కలిసి ఉంటున్నారనో కాదు. వారిద్దరూ కలిసి ఇల్లు కట్టుకుంటున్నారని. త్వరలోనే ఒకింటివారు కాబోతున్నారని. ముంబైలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు దీప్‌వీర్. రణ్‌వీర్ సింగ్‌కీ, దీపిక పదుకోన్‌కీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు, ఆ పోస్టులు ఇన్‌స్టంట్‌గా వైరల్ అయిపోతాయి. ప్రస్తుతం వారిద్దరూ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీపిక పదుకోన్ బ్లాక్ హుడీ వేసుకుని, మ్యాచింగ్ ట్రాక్ ప్యాంట్స్ లో ఉన్నారు. రణ్‌వీర్ సింగ్ బ్లాక్ టీ షర్ట్, హాఫ్ ప్యాంట్స్ తో కనిపిస్తున్నారు. ఆయన ఫేస్‌కి మాస్క్ కూడా ఉంది. షార్ట్ హెయిర్‌తో ఉన్నారు. రణ్‌వీర్ తల్లిదండ్రులు కూడా అదే సైట్‌లో ఉన్నారు. ఇల్లు కడుతున్న తీరును చూసుకోవడానికి ఫ్యామిలీ మొత్తం అక్కడ గ్యాదర్ అయ్యారని చూసిన వారికి అర్థమవుతుంది.
షారుఖ్ ఖాన్ బంగ్లా మన్నత్‌కి దగ్గర్లోనే బ్యాండ్‌స్టాండ్ బిల్డింగ్‌లో 16, 17, 18, 19 క్వాడ్రూప్లెక్స్ ని దీపిక, రణ్‌వీర్ తీసుకున్నారు. గతేడాది ఈ క్వాడ్రూప్లెక్స్ ని తీసుకున్నారు. దాదాపు 119 కోట్లు పెట్టారు ఆ ఇంటికి. అలీ భాగ్‌లోనూ వీరికి ఓ ఇల్లు ఉంది. ఇప్పుడు ముంబైలో ఈ కొత్త సైట్‌లో ఇల్లు కడుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఎవరికీ లేనంత లావిష్‌గా ఈ ఇంటిని డిజైన్ చేయించుకున్నారట దీపిక పదుకోన్. ఆమెకు మొక్కలంటే చాలా ఇష్టమట. చుట్టూ గ్రీనరీ ఉండేలా, ఎకో ఫ్రెండ్లీగా, సరికొత్తగా డిజైన్ చేయించుకుంటున్నారట. ఇంటి నిర్మాణం పూర్తికాగానే, గృహప్రవేశానికి సంబంధించిన గుడ్‌న్యూస్ చెబుతారట దీప్‌వీర్.