English | Telugu

ఎట్టకేలకు ఓటీటీలోకి 300 కోట్లరూపాయిల సినిమా.. తెలుగులో కూడా 

కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా తుఫాన్ వచ్చేముందు ప్రకృతి ఎంత సైలెంట్ గా ఉంటుందో, అంతే సైలెంట్ గా థియేటర్స్ లోకి అడుగుపెడతాయి. కానీ ఆ తర్వాత సదరు  చిత్రం సాధించే విజయం ముందు తుఫాన్ సైతం చిన్నబోతుంది. అలాంటి ఒక చిత్రమే   ఆగస్ట్ 28 న వరల్డ్ వైడ్ గా విడుదలైన 'కొత్త లోక చాప్టర్ 1'(Kotha LOkah Chapter 1).వందల ఏళ్ళ నాటి యక్షలోకానికి చెందిన స్త్రీ, ప్రస్తుత సమాజంలో ఇంకా జీవించి ఉంటేఎలా ఉంటుంది అనే కొత్త పాయింట్ తో తెరకెక్కింది. 24 క్రాఫ్ట్స్ మొత్తం ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చెయ్యడంతో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.