English | Telugu

సమంత, రాజ్ పెళ్లిపై రాజ్ సోదరి పోస్ట్ వైరల్..ఇలా జరగాల్సిందే అంటున్న ఫ్యాన్స్   

రాజ్ సోదరి ఏం చెప్పింది!
అభిమానులు ఏమంటున్నారు
'లవ్‌ యూ' చెప్పిందెవరు!

డిసెంబర్ 1 సాయంత్రం నుంచి స్టిల్ నేటి వరకు దాదాపుగా అన్ని మీడియా ఛానల్స్, సోషల్ మీడియా వేదికగా చూసినా కూడా సమంత(Samantha),రాజ్(Raj)సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ వస్తున్నారు. ఆ ఇద్దరి పెళ్లికి సంబంధించిన ఎన్నో స్పెషల్ న్యూస్ తో పాటు సమంత, రాజ్ పరిచయం, ఆ తర్వాత పెళ్ళికి దారి తీసిన పరిస్థితులు వంటి విషయాల గురించి వస్తూనే ఉన్నాయి. అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో సదరు వార్తలని చూస్తూ ఉండటమే కాకుండా సమంత, రాజ్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నారు.

రీసెంట్ గా సమంత, రాజ్ ల వివాహం పై రాజ్ సోదరి 'శీతల్'(Shethal)సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ నోట్ ఒకదాన్ని విడుదల చేసింది. సదరు నోట్ లో ఆమె స్పందిస్తు 'నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగిపోతుండటంతో పాటు సమంత, రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకుసాగుతుండడం చూసి మాకెంతో గర్వంగా ఉంది.

aslo read:పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడు! తెలంగాణ ఫ్యాన్స్ ఏమంటున్నారు


ఒకరిపై ఒకరికి గౌరవం, నిజాయతీతో రెండు హృదయాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతో నిండిపోతుంది.సమంతకి నేను ఎప్పుడు అండగా ఉంటాను .భక్తుడు ఆర్తితో శివ లింగాన్ని ఆలింగినం చేసుకొంటే ఎంత ఆనందంగా ఉంటాడో ఈ రోజు నేను అలా ఉన్నాను. మేము వీరికి ఎప్పుడూ అండగా ఉంటామని నోట్ లో రాసుకొచ్చింది. సదరు పోస్ట్‌పై సమంత స్పందిస్తు 'లవ్‌ యూ'(LOve You)అని రిప్లై ఇచ్చింది. ఇక అభిమానులైతే మెట్టినింట సమంత కి ఎంతో ప్రేమ దక్కుతుండటంపై సోషల్ మీడియా వేదికగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.