English | Telugu

రాజ్ విషయంలో సమంత కీలక నిర్ణయం!

-ఏంటి ఆ కీలక నిర్ణయం
-అభిమానుల సంతోషం
-సమంత అప్ కమింగ్ సినిమాలు ఏవి!


అభిమానులు ఆశించినట్టుగానే సమంత(Samantha)ప్రముఖ హీరో 'నాగ చైతన్య'(Naga Chaitanya)తో విడాకులు తీసుకున్న చాలా సంవత్సరాలకి మళ్ళీ పెళ్లి చేసుకొని అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. దీంతో దర్శకుడు రాజ్(Raj)తో తన నూతన జీవితం బాగుండాలని వాళ్లంతా కోరుకుంటున్నారు. సమంత రాకతో తమ కుటుంబం పరిపూర్ణమైందని రాజ్ కుటుంబ సభ్యులు కూడా పేర్కొనడంతో సమంత కి సదరు రాజ్ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో కూడా అర్ధమవుతుంది.ఇక రాజ్ విషయంలో సమంత ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది.

రాజ్ సుదీర్ఘ కాలం నుంచి దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా సినీ రంగంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజ్ తెలుగు వాడైనా సరే ముంబై(Mumbai)లోనే ఎప్పట్నుంచో నివాసం ఉంటున్నాడు. దీంతో హైదరాబాద్ లో ఉంటున్న సమంత ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఫ్యూచర్ లో తెలుగు సినిమాలు చేసినా ముంబై నుంచే రాకపోకలు సాగించాలని సమంత ప్లాన్ అని కూడా చెప్తున్నారు.

also read:ఈ రోజు బెనిఫిట్ షో కి ఏం జరగబోతుంది. బాలయ్య చూసే ఏరియా ఇదేనా!

ప్రస్తుతం తెలుగులో సమంత సినీ కెరీర్ ని చూసుకుంటే ఎలాంటి కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. కొన్ని నెలల క్రితం స్వీయ నిర్మాణంలో 'మా ఇంటి మహాలక్షి' మూవీని అనౌన్స్ చేసినా సదరు చిత్రం గురించి అప్ డేట్ వచ్చి చాలా రోజులు అయింది. ఆ సినిమా ఆగిపోయిందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. హిందీలో మాత్రం తన భర్త రాజ్ తో కలిసి 'రక్త్ బ్రహ్మాండ్.. ది బ్లడీ కింగ్ డమ్' అనే వెబ్ మూవీ చేస్తున్నట్టుగా టాక్. నిజానికి చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్జ్ గురించి వార్తలు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ నిర్మాణం వహిస్తుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.