English | Telugu

పాకిస్తాన్‌లో మహావతార్‌ నరసింహ.. విజయం మనదే!

- భ‌క్తి పార‌వ‌శ్యంలో ముస్లిం భ‌క్తులు
- అంద‌రికీ షాక్ ఇచ్చిన మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌
- పాకిస్తాన్‌లోనూ జ‌య‌కేత‌నం

2025లో విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమాలు, బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించిన సినిమాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి సినిమాల్లో 'మహావతార్‌ నరసింహ' ఒకటి. కమర్షియల్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద తమ సత్తా చూపిస్తుంటాయి. కానీ, ఇది ఒక యానిమేషన్‌ మూవీ. పైగా భక్తి ప్రధాన చిత్రం. మొదట ఈ సినిమాను కన్నడ భాషలో మాత్రమే విడుదల చేశారు. ఇతర భాషల్లో కూడా ఆదరణ లభిస్తుందన్న ఉద్దేశంతో తెలుగు, హిందీ భాషల్లోకి డబ్‌ చేసి విడుదల చేశారు. మేకర్స్‌ ఊహించినట్టుగానే అన్ని భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది 'మహావతార్‌ నరసింహ'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది.


ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమాను పాకిస్తాన్‌లో కూడా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే.. అక్కడి ప్రేక్షకులు సినిమాను చూసి తన్మయత్వంతో పులకించిపోతున్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకుల స్పందనను వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడా వీడియోలు వైరల్‌గా మారాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే పాకిస్తాన్‌లో హిందూ దేవుడిపై నిర్మించిన సినిమా విడుదల కావడమే విశేషం అయితే, దానికి అద్భుతమైన స్పందన లభించడం మరో విశేషం. ఈ సినిమాకి పాకిస్తాన్‌లో లభిస్తున్న ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది అసలైన విజయం అంటూ ఆ వీడియోలను షేర్‌ చేస్తున్నారు.


ముఖ్యంగా కరాచిలోని ఒక థియేటర్‌లో భక్తి భావంతో సినిమాను చూస్తూ దండం పెట్టుకుంటున్నారు. ఇండియాలోనూ చాలా థియేటర్లలో ప్రేక్షకులు భక్తి తన్మయత్వంతో ఊగిపోవడం మనం చూశాం. అయితే పాకిస్తాన్‌లో కూడా ఇదే స్పందన రావడం అందర్నీ షాక్‌కి గురి చేసే అంశమే. సినిమాలోని ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. దాంతో పాకిస్తాన్‌లోనూ ఈ సినిమాపై చర్చ జరుగుతోంది. హిందు, ముస్లిం అనే తేడా లేకుండా ఒకే భక్తిభావంతో 'మహావతార్‌ నరసింహ' చిత్రాన్ని చూడడం అనేది అరుదైన సంఘటనగా చెప్పుకుంటున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.