English | Telugu

ఓటిటి లో వార్ 2 రికార్డు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దొరికిన ఆయుధం

స్టార్ హీరోలు ఎన్టీఆర్(Ntr),హృతిక్ రోషన్(Hrithik Roshan)సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన మూవీ 'వార్ 2'(War 2)ఇండియా ఫస్ట్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కగా అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మిక్స్డ్ టాక్ కి సైతం ఎదురెళ్లి 350 కోట్లరూపాయల దాకా వసూలు చేసి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఆ ఇద్దరి హీరోల కట్ అవుట్స్ కి ఉన్న స్టామినాని తెలియచేసింది. ఈ నెల 9 నుంచి ఓటిటి వేదికగా  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి రాగా, సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్ 2 రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ హీరోకి కీర్తి సురేష్ క్షమాపణలు.. కారణం తెలిస్తే షాక్ గ్యారంటీ  

అందం, అభినయం కలగలిసిన నటీమణుల్లో ప్రముఖ హీరోయిన్ 'కీర్తి సురేష్'(Keerthy suresh)కూడా ఒకరు. కేరళ కి చెందిన కీర్తి బాల్యం నుంచే మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతు, రామ్ పోతినేని(Ram Pothineni)హీరోగా వచ్చిన 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలజ క్యారక్టర్ లో క్యూట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి, మొదటి చిత్రంతోనే ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ తర్వాత చేసిన  నేను లోకల్, అజ్ఞాతవాసి,సర్కారివారి పాట, దసరా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలు కూడా కీర్తి రేంజ్ ని పెంచాయి. మహానటి తో అయితే చెప్పక్కర్లేదు, ఎవర్ గ్రీన్ లెజండ్రీ యాక్ట్రస్ సావిత్రిగారి క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించి, సావిత్రి గారిని మన కళ్ళ ముందుకు మళ్ళీ సజీవంగా నిలబడేలా చేసింది. గత ఏడాది డిసెంబర్ 12 న 'ఆంథోనీ తటిల్' నిప్రేమ వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.