English | Telugu

రవితేజ సరసన ఆరుగురు హీరోయిన్లు.. ఇదెక్కడి జాతర స్వామీ?

- సంక్రాంతికి భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి
- ర‌వితేజ స‌ర‌స‌న ఆరుగురు హీరోయిన్లు
- శివ నిర్వాణ డైరెక్ష‌న్‌లో సినిమా


ఒకప్పుడు మాస్‌ హీరోగా చక్రం తిప్పిన మాస్‌ మహారాజ్‌ రవితేజకు ఇటీవలికాలంలో హిట్‌ అనేది కరువైంది. క్రాక్‌, ధమాకా వంటి హిట్‌ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న రవితేజ హీరోగా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఇటీవల విడుదలైన మాస్‌ జాతర కూడా అలాంటి ఫలితాన్నే ఇచ్చింది.


ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పేరుతో ఓ విభిన్న చిత్రం చేస్తున్నారు రవితేజ. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమా రిలీజ్‌ అవ్వకముందే మరో ప్రాజెక్ట్‌ని సెట్‌ చేసుకొని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఏదీ రాలేదు. అయినప్పటికీ లేటెస్ట్‌ న్యూస్‌ పేరుతో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఆరుగురు హీరోయిన్లు నటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలో నిజం లేదని చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది. ఈ సినిమాకి సంబంధించి తాము అఫీషియల్‌గా ఇచ్చే అప్‌డేట్‌ను మాత్రం నమ్మాలని ప్రేక్షకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు మేకర్స్‌.