English | Telugu

అఖండ 2 పై నారాయణ ఫైర్.. ఓజి కి ఎంత రేట్ చెప్పారు 

అభిమానుల పడిగాపులు
నారాయణ ఏం చెప్తున్నాడు?
అఖండ 2 కి ఎంత పెంచారు
ఓజి అప్పుడు ఎంత?

రేపు సాయంత్రం నుంచి శివస్థతుల కేరింతలు, అభిమానుల ఆనందోత్సవాల మధ్య సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(AKhanda 2)ద్వారా బాలయ్య(Balakrishna)జాతర ప్రారంభం కాబోతుంది. ప్రచార చిత్రాలతో ప్యూర్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడంతో మూవీ లవర్స్ కూడా పెద్దఎత్తున థియేటర్స్ కి పోటెత్తనున్నారు. దీంతో అఖండ 2 తొలి రోజు సాధించే కలెక్షన్స్ పై కూడా అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కే అన్ని బడా సినిమాలకి ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖండ 2 కి బెనిఫిట్ షో తో పాటు కొన్ని రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.

ఇప్పుడు ఈ విషయంపై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ(Narayana)మాట్లాడుతు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తున్నపేరుతో ప్రజల మీద భారం మోపడం సరైంది కాదు. ఇదే విధంగా టికెట్లు పెంచుకుంటు పోతే స్వయంగా ప్రభుత్వమే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టడానికి కారణమవుతుంది. పెద్ద సినిమాలకి పదే పదే రేట్లు పెంచుతున్నప్పుడు ప్రజలు పైరసీ వైపు మొగ్గుచూపుతారు. తర్వాత ఆ రవిలాంటి వారిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. కానీ అలాంటి వ్యవస్థను సృష్టించిన ప్రభుత్వం, నిర్మాతలదే తప్పు'అని స్పష్టం చేశారు.


also read: సమంత, రాజ్ పెళ్లిపై రాజ్ సోదరి పోస్ట్ వైరల్..ఇలా జరగాల్సిందే అంటున్న ఫ్యాన్స్



అఖండ 2 కి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులని ఒకసారి చూస్తే ప్రీమియర్ షోకి 600 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో 75, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయిలు పెంపుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. పెంచిన ధరలు డిసెంబర్ 5 నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి ఇక గత సెప్టెంబర్ లో వచ్చిన మరో పెద్ద మూవీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో ఓజికి సంబంధించి బెనిఫిట్ షో టికెట్ 1000 రూపాయలతో పాటు మొదటి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలుపుకొని 125 రూపాయలు, మల్టీప్లెక్స్ 150 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.