English | Telugu

చిత్ర పరిశ్రమలో విషాదం.. ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్‌ అధినేత శరవణన్‌ ఇకలేరు!

ప్రముఖ నిర్మాత, ఎ.వి.ఎం. సంస్థ అధినేత శరవణన్‌(శరవణన్‌ సూర్య మణి) కన్ను మూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్‌ 4 గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. తమిళ్‌, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 170కి పైగా సినిమాలు నిర్మించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎవిఎం సంస్థకు ఒక విశిష్ట స్థానం ఉంది. చిత్ర నిర్మాణ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించి పలు భారతీయ భాషల్లో ఎన్నో అపురూపమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన సంస్థ. ఎవిఎం సంస్థ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులు మెచ్చే సినిమాలు నిర్మిస్తూ వారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది ఎవిఎం.


తెలుగులో సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్‌ సినిమాలకు శరవణన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఎవిఎం స్టూడియోస్‌ను స్థాపించిన దిగ్గజ వ్యవస్థాపకుడు ఎ.వి.మెయ్యప్పన్‌ కుమారుడు శరవణన్‌. తన తండ్రి స్థాపించిన నిర్మాణ సంస్థను దిగ్విజయంగా ముందుకు నడిపించి ఎన్నో అపురూపమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు శరవణన్‌. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకుగాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.


సినిమాలు నిర్మిస్తూనే 1986లో మద్రాస్‌ షెరీఫ్‌గా ప్రజలకు కూడా సేవ చేశారు శరవణన్‌. ఇటీవలికాలంలో ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా సంస్థకు సంబంధించిన కార్యకలాపాలను ఆయన కుమారుడు ఎం.ఎస్‌.కుగన్‌ నిర్వహిస్తున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంస్థల్లో ఒకటైన ఎవిఎం సంస్థను విజయవంతంగా నిర్వహించిన శరవణన్‌ మరణం ఒక శకానికి ముగింపు పలికింది. శరవణన్‌ మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.