విజయశాంతిని సూపర్ స్టార్ గా నిలబెట్టిన 'ప్రతిఘటన'కు 40 ఏళ్ళు!
తెలుగు సినీ చరిత్రలో 'ప్రతిఘటన' చిత్రానికి ప్రత్యేక స్థానముంది. విజయశాంతి ప్రధాన పాత్రలో టి.కృష్ణ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా.. 1985 అక్టోబర్ 11న విడుదలై సంచలనం సృష్టించింది. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ గా నిలబెట్టింది. నటీనటుల గొప్ప నటన, అద్భుతమైన కథాకథనాలు, మాటలు, పాటలు కలిసి ఈ సినిమాని గొప్పగా మలిచాయి.