English | Telugu

రాజాసాబ్ మూవీ ర‌న్‌టైమ్ ఎంతో తెలుసా?.. ప్ర‌భాస్‌కిది మామూలేనా?

- ప్ర‌భాస్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు
- సంక్రాంతి కానుక‌గా రాజా సాబ్‌
- ప్ర‌భాస్ మొద‌టి హార‌ర్ థ్రిల్ల‌ర్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ 'ది రాజా సాబ్‌'. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటివరకు డైరెక్టర్‌ మారుతి చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

సలార్‌, కల్కి వంటి భారీ హిట్స్‌ తర్వాత ప్రభాస్‌ చేస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్దికుమార్‌.. ఈ ముగ్గురూ ప్రభాస్‌తో రొమాన్స్‌ చెయ్యబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సంజరుదత్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ చూసిన తర్వాత ప్రేక్షకుల్ని రాజాసాబ్‌ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడని అర్థమవుతోంది.

షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈమధ్యకాలంలో ప్రభాస్‌ చేసిన సినిమాలన్నీ ఎక్కువ రన్‌టైమ్‌తోనే ఉన్నాయి. ఇప్పుడు రాజాసాబ్‌ కూడా ఆ వరసలో నిలవబోతోంది. ఈ సినిమాకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు 'ది రాజా సాబ్‌' మూవీ రన్‌టైమ్‌ సుమారు 3 గంటలా 14 నిమిషాలుగా కనిపిస్తోంది. అంటే ప్రభాస్‌ గతంలో చేసిన సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా రన్‌టైమ్‌ ఉంది. మరి ఇది సినిమా రన్‌పై ప్రభావం చూపిస్తుందా? లేక ట్రిమ్‌ చేస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.