English | Telugu

మెహర్ రమేష్ తో పవన్ కళ్యాణ్ మూవీ డీటెయిల్స్ ఇవే! ఫ్యాన్స్ లో టెన్షన్  

తన కట్ అవుట్ కి తగ్గ సినిమా పడితే ఎలా ఉంటుందో 'ఓజి'(OG)తో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మారోమారు నిరూపించాడు. పైగా పవర్ స్టార్ అనే బిరుదుకి తగట్టుగా సినిమా మొత్తం పవర్ ఫుల్ గా ఉండటంతో, పవన్ నుంచి ఇలాంటి సినిమాలు కదా ఆశిస్తుందని అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు కూడా ఇలాంటి చిత్రాల్లోనే పవన్ నటించాలని, డైరెక్టర్స్  విషయంలో శ్రద్ధ వహించాలని సోషల్ మీడియా వేదికగా కోరుతు వస్తున్నారు. ఇక పవన్ రీసెంట్ గా మాట్లాడుతు ఓజి సీక్వెల్ తో పాటు సినిమాల్లో కంటిన్యూ అవుతానని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పలువురు దర్శకులు పవన్ కి కథ చెప్పి ఒప్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.