నువ్వే కావాలి కి పాతిక సంవత్సరాలు.. ఆ హీరో అనుకుంటే తరుణ్ వచ్చాడు
కొన్నిచిత్రాలకి ఎక్స్ పైరీ డేట్ ఉండదు. అలాంటి ఒక చిత్రమే నువ్వేకావాలి(Nuvve kavali). అక్టోబర్ 13 2000 వ సంవత్సరంలో థియేటర్స్ లో అడుగుపెట్టింది. స్నేహం, ప్రేమకి సరికొత్త అర్ధాన్ని చెప్పడంతో పాటు తెలుగునాట ఇదే కోవలో మరెన్నో చిత్రాలు తెరకెక్కడానికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తరుణ్, రిచాల అద్భుతమైన పెర్ ఫార్మెన్స్, విజయ్ భాస్కర్(Vijay Bhaskar) దర్శకత్వం, త్రివిక్రమ్(Trivikram)సంభాషణలు, ఆకట్టుకొనే పాటలు, అభిరుచితో కూడిన నిర్మాణ సంస్థ పని తీరు ఇలా అన్ని ఒకదాన్ని మించి ఒకటి పోటీపడి 'నువ్వేకావాలి' ని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక దృశ్య కావ్యంలాగా మిగిలిపోయేలా చేసాయి.