English | Telugu

సంక్రాంతి బరిలో శర్వానంద్..పిల్లలు ఆ సినిమా ఫలితాలు గుర్తున్నాయా అంటు నిర్మాత ట్వీట్ 


-శర్వానంద్ రిస్క్ చేస్తున్నాడా!
-నిర్మాత ట్వీట్ వైరల్
-2016 లో ఏం జరిగింది


హీరో శర్వానంద్(sharwanand)సినిమాలు ఎంచుకునే శైలికి, మిగతా హీరోలు ఎంచుకునే సినిమాల శైలికి ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఇందుకు శర్వానంద్ గత చిత్రాలే ఉదాహరణ. గత ఏడాది రొమాంటిక్ డ్రామా 'మనమే' తో పలకరించగా ఇప్పుడు ఫ్యామిలీ జోనర్ లో తెరకెక్కిన 'నారి నారి నడుమ మురారి'(Nari Nari Naduma Murari)తో ముస్తాబవుతున్నాడు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)నుంచి వచ్చిన హిట్ మూవీ టైటిల్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కూడా నెలకొని ఉంది.

ఇక ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని మేకర్స్ కొన్ని రోజుల క్రిందట ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. కానీ ఆ తర్వాత అప్ డేట్ లేకపోవడంతో బడా సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంతో పండక్కి రాకపోవచ్చని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా నారి నారి నడుమ మురారి నిర్మాత 'అనిల్ సుంకర'(Anil sunkara)ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'అబ్బాయిలు ఎవరికైనా 2016 సంక్రాంతి సినిమా ఫలితాలు గుర్తున్నాయా? అంటు ట్వీట్ చేసాడు.

ఈ ట్వీట్ చూస్తుంటే పొంగల్ బరిలోకి మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ఉందని అభిమానులతో పాటు మూవీ లవర్స్ భావిస్తున్నారు. అనిల్ సుంకర ట్వీట్ ప్రకారం చూసుకుంటే 2016 సంక్రాంతికి శర్వానంద్ 'ఎక్స్ ప్రెస్ రాజా' అనే మూవీతో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ఆ టైంలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా', ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో', బాలకృష్ణ డిక్టేటర్ తో స్క్రీన్ పై సందడి చేసినా'ఎక్స్ ప్రెస్ రాజా' తో విజయాన్ని అందుకున్నాడు.

also read:నెంబర్ వన్ గా నిలుస్తాడా!


2017లో కూడా 'ఖైదీ నెం 150 ,గౌతమీ పుత్ర శాతకర్ణి ఉన్నా 'శతమానం భవతి' తో విజయాన్ని అందుకున్నాడు. మరి ఇప్పుడు ఈ సంక్రాంతికి ప్రభాస్ 'ది రాజాసాబ్', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', విజయ్ 'జన నాయకుడు', శివ కార్తికేయన్ 'పరాశక్తి' వంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'నారీ నారీ నడుమ మురారి'తో మరోసారి శర్వానంద్ సంక్రాంతి బరిలో దిగితే ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. 'సామజవరగమన' ఫేమ్ 'రామ్ అబ్బరాజు' దర్శకత్వంలో నారి నారి నడుమ మురారి తెరకెక్కుతుండగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా చేస్తున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.