English | Telugu
నామినేషన్ లో తప్ప ఎవరితో ఆ విషయాలు మాట్లాడలేదు: అంబటి అర్జున్!
Updated : Dec 18, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఎట్టకేలకు ముగిసింది. ఇక హౌస్ లో మిగిలిన టాప్ కంటెస్టెంట్స్ యొక్క బజ్ ఇంటర్వూలు ఇప్పుడు అఫీషిలయల్ గా యూట్యూబ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇందులో అంబటి అర్జున్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోపల జరిగేది వేరు. బయటకి చూపించేది వేరు అంటూ మొదలెట్టాడు అర్జున్.
శివాజీని కావాలనే టార్గెట్ చేశారా అని యాంకర్ అడుగగా.. నాకు టార్గెట్ అనేమీ లేదు. అతను మైండ్ గేమ్ బాగా ఆడతాడు. అది శివాజీ గారికి అనుభవం వల్ల వచ్చింది. కానీ నా దాకా వస్తే నేను అలానే రియాక్ట్ అవుతానని అర్జున్ అన్నాడు. ఫ్యామిలీ వీక్ లో పప్పీ రావడం వల్లనే ఆ తర్వాత నామినేషన్ లో అగ్రెసివ్ గా ఉన్నారా అని అడుగగా.. అదేం లేదు. యావర్ నా మీద నామినేషన్ వేశాడు కాబట్టి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అగ్రసెవ్ అయ్యానని అర్జున్ అన్నాడు. మీరు మాస్క్ వేసుకున్నారని అందరు అనుకుంటున్నారు? మీరేమంటారని గీతు అడుగగా.. అది వాళ్ళ అభిప్రాయం కానీ నేను ఆట ఆడాను. నాలాగే ఉన్నాని అర్జున్ అన్నాడు. స్టేజ్ మీద నాగార్జున గారితో హౌస్ లో దమ్ము, దుమ్ము ఎవరని అడిగినప్పుడు మీరు శివాజీ గారిని ఎక్స్ పోజ్ చేస్తానని అన్నారు? మరి చేశారా అని అడుగగా.. నాదాకా వస్తే నేను మాట్లాడేవాడిని. ఎదురు చూసాను కానీ ఆయన రాలేదు. అవకాశం రాలేదని అర్జున్ అన్నాడు.
గౌతమ్ కి నామినేషన్ ముందు ఒకటి అన్నారు. శివాజీ టైమ్ వచ్చినప్పుడు మాట దాటేస్తారని అని గౌతమ్ అన్నప్పుడు.. మీరు అతనికి సపోర్ట్ గా మాట్లాడి దానిని తీసుకెళ్ళి నామినేషన్ గా చేశారని గీతు అడుగగా.. అవును, వాడు అలా చెప్పడం నాకు నచ్చలేదు అందుకే నామినేషన్ చేసి చెప్పానని అర్జున్ అన్నాడు. ఆ రోజు పప్పీ గురించి మీకోసం శివాజీ స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడే ఆ రీజన్ నాకు నచ్చ లేదని చెప్పొచ్చు కదా అని గీతు అడుగగా.. నాకు నిజంగా ఆ రోజు శివాజీ గారు చెప్పిన పాయింట్ నచ్చలేదు ఆ విషయం చెప్పాను కానీ వాడు వెళ్ళి అదే రీజన్ తో నాకే సపోర్ట్ చేశాడు. నా గేమ్, నా ఎఫర్ట్స్, నా కెప్టెన్సీ బాగున్నాయని చెప్పి అంతటితో ఆపేస్తే బాగుండేది కానీ వైఫ్ ని అడ్డుపెట్టుకొని కెప్టెన్ అవ్వలానుకోలేదు. ఇక చివరగా అమర్ దీప్, నేను ఉన్నప్పుడు.. ఏం చేద్దాం అర్జున్ అని శివాజీ గారు నా దగ్గరకి వచ్చి అడిగారు.. కెప్టెన్సీ ఇచ్చేయన్న వాడికే అని చెప్పాను కానీ అప్పటికే ఇచ్చిన టైమ్ అయిపోయిందని బిగ్ బాస్ ఇద్దరి ఫోటోలు కాల్చేశాడు. ఇక అలా నేను చేసిన ఆలస్యం వల్ల అది తిరిగి తిరిగి నాకే చుట్టుకుందని అర్జున్ అన్నాడు. ఇక ఆ తర్వాతి శివాజీ గారు నామినేషన్ లో నా గురించి అంతలా చెప్పడం నాకు బాగనిపించేలదని అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలని అర్జున్ షేర్ చేశాడు.