English | Telugu
వామ్మో శ్రీరామ్ గారు ఏంటి ఈ మధ్య ఇంత ఫాస్ట్ గా ఉన్నారు!
Updated : Dec 17, 2023
సూపర్ సింగర్ 2023 న్యూ సీజన్ డిసెంబర్ 23 నుంచి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి, జడ్జెస్ గా మంగ్లీ, అనంత శ్రీరామ్, రాహుల్ సిప్లిగంజ్, శ్వేతా మోహన్ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో శ్రీముఖి పింక్ కలర్ డ్రెస్ లో అదరగొట్టేసింది. ఈ షో శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది.
ఇక ఈ షోలో ఒక్కొక్కళ్ళ ఎంట్రీ ఒక్కో రేంజ్ లో ఉంది. శ్వేతా మోహన్ స్టేజి మీదకు వచ్చి కంటెస్టెంట్ తో కలిసి ఆదిపురుష్ మూవీలో "ప్రియ మిథునం మనలా" అనే సాంగ్ ని చాల అద్భుతంగా పాడి వినిపించారు. ఇక ఆమె పాడిన ఈ సాంగ్ కి అనంత శ్రీరామ్ వ్వాహ్ అని కామెంట్ ఇచ్చారు. తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒక సాంగ్ అందుకున్నాడు "గట్టా నడుచుకుని గేటులన్నీ దాటుకొస్తే" అనే సాంగ్ డాన్స్ వేస్తూ పాడుతూ స్టేజి మీదకు వచ్చాడు. ఆ సాంగ్ కి అనంత శ్రీరామ్ కి మంచి ఊపొచ్చేసి గాల్లో ఎగిరి మరీ పిల్లి మొగ్గ వేశారు. ఆయన ఫీట్ చూసిన శ్వేతా మోహన్ షాకైపోయారు. "సూపర్ సింగర్ వేదిక మీదున్నానా రాహుల్ చిచ్చా పబ్ లో ఉన్నానా అనిపించింది" అంటూ కామెంట్ చేశారు.
ఇక ఈ షో గురించి నెటిజన్స్ నుంచి వెరైటీ కామెంట్స్ వినిపించాయి. "వామ్మో శ్రీరామ్ గారు ఏంటి ఈ మధ్య ఇంత ఫాస్ట్ గా ఉన్నారు.. అనంత శ్రీరామ్ కి తప్ప మిగతా వాళ్ళు ఎం జడ్జి చేస్తారు... మంగ్లీ జడ్జిమెంట్ అంటే షోలో గొడవలే..గీత మాధురి ఐతే జడ్జిగా బాగుంటుంది.. తమిళ్ వాళ్ళు లేకుండా షో చేయలేరా...సింగింగ్ కాంపిటీషన్ లో డాన్స్ ఎందుకు బాబు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సింగింగ్ కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది...ఎలాంటి కంటెంట్ రాబోతోంది...ఎలా జడ్జిమెంట్ ఉండబోతోంది అనేది.