English | Telugu

బయటపడ్డ అఖిల్ బాగోతం.. ఫోటో కాస్త మంచిది పెట్టండి!


బిగ్ బాస్ సీజన్-7 విజయవంతంగా ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా అమర్ దీపు రన్నర్ గా నిలిచి కోట్లాది ప్రేక్షకుల ఉత్సాహానికి తెర దించారు. అయితే బిగ్ బాస్ రన్నర్ అయిన అమర్ దీప్ తన భార్య తేజస్విని గౌడ, తల్లితో కలిసి అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వస్తుండగా కొంతమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అతని కార్ పై దాడి చేశారు. ఇది నిన్నంతా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్తను హైలైట్ చేయడానికి కొన్ని యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు అఖిల్ సార్థక్ పేరుని వాడుకున్నారంట. ఇది మరీ దారుణం రా అంటూ అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి పల్లవి ప్రశాంత్ ఒక రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు ఒక ఎమోషన్ క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన మాటల యుద్ధమే జరిగింది. అది కాస్త చిలికి చిలికి‌ పెద్ద గాలి వాన అయినట్లు.. గొడవ పెద్దగా అయింది. ఇక ఆ నామినేషన్ ప్రక్రియలో గొడవ కాస్త.. రైతులు వర్సెస్ బిటెక్ స్టూడెంట్స్ గొడవలా మారింది. ఇక ఈ ఇష్యూ మీద పలువురు రైతులు అమర్ దీప్ ని తీవ్రంగా విమర్శించారు. అది అప్పట్లో వైరల్ గా మారింది. రైతులని అమర్ దీప్ తక్కువ చేసి మాట్లాడడంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ పై కోపంగా ఉన్నారు అందుకే అమర్ బయటకు రాగానే తన కారు అద్దాలు పగులగొట్టారు.

అసలు విషయనికి వస్తే.. అఖిల్ సార్థక్ మొదట నుండి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తు వస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అయిన అఖిల్ సార్థక్.. మొదటి నుండి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ ఇస్తున్నాడు. అయితే హౌస్ లోని మరే ఇతర కంటెస్టెంట్ గురించి తక్కువ చేసి కూడా మాట్లాడలేదు. అలా ప్రశాంత్ గురించి ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో సపోర్ట్ ఇస్తు పోస్ట్ లు చేసాడు అఖిల్ సార్థక్. అయితే మొన్న జరిగిన గొడవ వల్ల కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అమర్ పై దాడి చేసింది ఎవరంటూ.. "బయటపడ్డ ఓల్డ్ కంటెస్టెంట్ బాగోతం" అని ఓ టైటిల్ పెట్టి అఖిల్ సార్థక్ ఫోటోతో ఒక వీడియో చేశారు. అది చూసిన అఖిల్ సార్థక్‌.. ఒక సెటైరికల్ రిప్లై ఇచ్చాడు. మీరు ఇదంతా వ్యూస్ కోసమే చేస్తున్నారు. కానీ నా ఫోటో ఇంకాస్త మంచిది పెట్టి ఉంటే బాగుండేది. ఇలా న్యూస్ స్ప్రెడ్ చెయ్యడం ఆపండి. ఏది ఏమైనా అమర్ పై అలా దాడి చెయ్యడం కరెక్ట్ కాదంటు తన అభిప్రాయం తెలియజేశాడు అఖిల్ సార్థక్. ఇదంతా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది ఫుల్ వైరల్ గా మారింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.