English | Telugu

బిగ్‌బాస్ విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌.. నిజాలు చెప్పిన రన్నర్ అమర్ దీప్!


బిగ్ బాస్ సీజన్-7 విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. టాప్ లో ఉన్నవారి ఎగ్జిట్‌ ఇంటర్వూలని గీతు రాయల్ తీసుకుంది. ఇందులో హౌస్ లో ఏ కంటెస్టెంట్ తమతో ఎలా ఉన్నారో ఫైనలిస్టులు చెప్తూ తమ అభిప్రాయాలని షేర్ చేసుకున్నారు. మొదటగా అంబటి అర్జున్ బజ్ ఇంటర్వూ అప్లోడ్ చేయగా అందులో తన అటతీరుని చెప్పుకున్నాడు అర్జున్. అలాగే అమర్ దీప్ తన బిహేవియర్ హౌస్ లో ఎలా ఉందో చెప్పాడు.

హౌస్ లో శివాజీ వల్లే ప్రశాంత్ విన్నర్ అయ్యాడని అందరు అంటున్నారని గీతు అడుగగా.. ఎవరన్నారు?.. అది కరెక్ట్ కాదు. వాళ్ళు సొంతంగా ఆడి గెలిచారు కానీ శివాజీ అన్న వారికి సపోర్ట్ ఇచ్చాడు. తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని సినిమాలు చేశాడు. ఎక్కడ ఎలా ఉండాలో అయనకి తెలుసు కాబట్టి అతని మైండ్ గేమ్ తో యావర్, ప్రశాంత్ లకి సపోర్ట్ ఇచ్చాడు అంతే కానీ ఆయన్ని పైకి లేపకండి అని అమర్ దీప్ అన్నాడు. హౌస్ లో నువ్వు జెన్యునా అని అడుగగా.. హౌస్ లో ఎనభై కెమెరాలు ఉన్నాయి. ప్రతీ టాస్క్ లో మనల్ని చూస్తుంటాయి‌ కదా మరి నాకేందుకు అది గుర్తులేదో తెలియదు. హౌస్ లో ఎలా ఉంటుందంటే గేమ్ లో ఎలాగైనా గెలవాలని, ఏదో ఓ కాలేజ్ లో ఉన్నాని అనుకున్నానే తప్పా అసలు కెమెరాలు ఉన్నాయనే ఆలోచనే రాలేదని అమర్ అన్నాడు. ఎటో వైపు ఉండాలి.. ఒకవైపు పాజిటివ్ మరోవైపు నెగెటివ్ ఉంటే నేను నెగెటివ్ వైపు ఉన్నానని అమర్ అన్నాడు. అంటే నీకు బిబి బీపీలాగా ఎక్కేసిందంటావా అని అడుగగా.. ‌అవునని అమర్ అన్నాడు. హౌస్ లో సరిగ్గా అయిదు వారాలకే అర్థమైంది. అమ్మో వీళ్ళతో నేను పడలేనురా బయటకు వెళ్ళిపోదాం రా అనుకున్నా అని అమర్ అమ్నాడు. రవితేజ సినిమాలో ఆఫర్ ఇస్తా అని అనగానే అలా బయటకు వచ్చేశావేంటని అడుగగా.. ఆయన అంటే పిచ్చి.‌ మాస్ మహారాజ్ ని చూస్తూ పెరిగాను. ఆయనలా అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. అలాంటి నా ఫేవరేట్ హీరో నా కళ్ళముందు నిల్చొని నా సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే బయటకు వచ్చేశా అని అమర్ దీప్ అన్నాడు.

నీకు ప్రియాంక, శోభాశెట్టిలలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడుగగా.. నాకు ఇద్దరు సమానమే అని అమర్ అన్నాడు. ఒక్కరే అని చెప్పాలని అనగా.. శోభా నన్ను కెప్టెన్ గా చేయాలని శివాజీ అన్నని రిక్వెస్ట్ చేసింది. ప్రియాంక తో సీరియల్ లో చేశాను. తనతో నాకు మంచి స్నేహం ఉంది. తను నా కోసం గౌతమ్ ని పాయింట్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని ఇద్దరు సమానమే అని అమర్ అన్నాడు. అసలు రన్నర్ గా ఉంటావని అనుకున్నావా అని అడుగగా.‌. అసలు ఊహించలేదు. కానీ ఇక్కడి వరకు వచ్చాను సంతోషం. పల్లవి ప్రశాంత్ గెలిచాడనే రీగ్రెట్ లేదు. అలా అని బాధ లేదా అంటే ఉంది కానీ నేను ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచాను. నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరి దృష్టిలో నేను గెలిచానని అమర్ దీప్ అన్నాడు. ఇలా హౌస్ లో తనేంటో? తనతో తోటి హౌస్ మేట్స్ ఎలా ఉన్నారో కొన్ని ఆసక్తికరమైన విషయాలని బజ్ ఇంటర్వూలో అమర్ దీప్ పంచుకున్నాడు.