English | Telugu

శివాజీ కొడుకు రిక్కీ అందరిని ఏడిపించేశాడుగా!

బిగ్ బాస్ సీజన్-7.. 105 రోజులు, 19 మంది కంటెస్టెంట్స్.. ప్రతీ రోజు టాస్క్ లు.. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎలిమినేషన్స్, వీకెండ్ ప్రోమోల కోసం ఎదురుచూపులు అన్నీ ముగిసాయి. నిన్నటి ఆదివారం నాటి ఫినాలే వీక్ తో బిగ్ బాస్ సీజన్-7 ముగిసింది.

హౌస్ లో ఆరుగురు ఫైనలిస్టులు ఫినాలే వీక్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. శివాజీకి చేతిగాయం అయిన తర్వాత కూడా ప్రేక్షకులు అతనికి సపోర్ట్ గా నిలిచారు.‌ అందరు శివాజీనే విన్నర్ అవుతాడని అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ తరువాత లెక్కలు మారిపోయాయి. గురువుని మించిన శిష్యుడిగా ప్రశాంత్ పుంజుకున్నాడు.‌ ఇక ఎప్పుడు ఫౌల్స్ చేస్తూ, అల్లరిచిల్లరగా ఉండే అమర్ దీప్ సైతం తన భార్య చెప్పినట్టుగా గ్రూపిజం చేయకుండా కాస్త హౌస్ లోని మిగిలిన వారితో కలవడంతో అతనికి కలిసొచ్చింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ మూడో స్థానంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. శివాజీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాడంటే అతని రెండో కొడుకు రిక్కీనే కారణం. శివాజీకి బిగ్ బాస్ కి వచ్చినప్పుడు.. ‘నువ్వు ఆడలేవ్ నాన్న.. ఉండలేవ్ నాన్న’ అని రిక్కీ అన్న మాటలు శివాజీలో కసి పెంచాయి. తాడో పేడో తేల్చుకునే వస్తానని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే చాణుక్యుడిగా మారి జెండా పాతేశాడు. హౌస్ లో ఎంతమంది ఉన్న నా దారి నాదే.. నాతో ఎవరు పోటీ రారు అంటూ శివాజీ తోటి హౌస్ మేట్స్ దృష్టిలోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా మారి చివరికి ఫైనలిస్ట్‌గా నిలిచాడు.

అయితే నిన్నటి గ్రాంఢ్ ఫినాలే రోజున శివాజీ కొడుకు రిక్కీ ఎవరితో షేర్ చేయని ఒక విషయాన్ని నాగార్జునతో షేర్ చేసాడు. " మా నాన్న గెలిచిన ఓడిన సెలబ్రేట్ చేసుకుంటాం.. నేను ఆయన్ని ఆడలేడని అన్నాను.. కానీ ఆయన ఆడారు.. ఉండలేరన్నాను.. ఉండి చూపించారు.. మా నాన్న గెలిచినట్టే.. ఆయన్ని ఏదైనా నువ్వు చేయాలేవు అని అంటే చేసి చూపిస్తారనే రివర్స్ స్ట్రాటజీ ప్లే చేశా’ అని చెప్పాడు. తీరా శివాజీ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదికి వచ్చేసరికి చిన్న కొడుకు రిక్కీ తట్టుకోలేకపోయాడు. తండ్రిని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు రిక్కీ. "రేయ్ నాన్నా.. ఏడ్వద్దురా.. అరేయ్ నాన్నా.. అయ్యయ్యో ఏడుస్తావ్ ఏంట్రా.. ఇక్కడ ఓడిపోయానంటే.. ఇంకా ఏదో పెద్దది గెలుస్తారా.. నన్ను నమ్ము’ అంటూ కొడుకుని ఓదార్చిన సీన్‌ చూస్తే అందరికి కళ్లు చెమ్మగిల్లాయి. ఇది చూసి నాగార్జున కూడా ఎమోషనల్ అవుతూ.. ఇక్కడి వరకు వచ్చాడు. అందరి మనసులు గెలిచాడని అన్నాడు. విన్నర్ గా నిలుస్తాడని భావించిన శివాజీ మూడవ స్థానంలో ఎలిమినేట్ అవ్వడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.