English | Telugu
పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌కి రంగం సిద్ధం!
Updated : Dec 19, 2023
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయి బయటకు వచ్చాక ప్రశాంత్ కి చుక్కెదురైంది. గ్రాంఢ్ ఫినాలే ముగిసిన తర్వాత అన్నపుర్ణ స్టూడియో ముందు ప్రశాంత్ కి ప్రేక్షకులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పడానికి భారీగా తరలి వచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ కోసం అలా ర్యాలీలా వెళ్తు సిటీలో డిస్టబెన్స్ క్రియేట్ చేశారంట. దాంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రశాంత్ పై ట్రాఫిక్ వాయిలెన్స్ కింద కేసు నమోదు చేశారంట పోలీసులు.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగించుకొని వస్తున్న అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసిన విషయం తెలిసిందే. మరొక వైపు అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అశ్వినిశ్రీ, గీతు రాయల్ కార్లపై కూడా ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. వారిపై కూడా ఆశ్వినిశ్రీ, గీతు రాయల్ కేసు పెట్టారు. గీతూ రాయల్ తన కార్ అద్దాలు పగులగొట్టిన వారిని పట్టిస్తే పదివేల రూపాయల రివార్డ్ ఇస్తానని ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది గీతు. బిబి ఎగ్జిట్ ఇంటర్వ్యూలు పూర్తిచేసుకొని బయటకు వస్తున్న గీతు రాయల్ పై ఇలా చేయడం అన్ ఫెయర్ అంటూ తన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. అమర్ దీప్ ఫ్యాన్స్ , పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య ఇంకా గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఈ దాడికి పరిష్కారమేంటో తెలియాలి.
బిగ్ బాస్ ఇన్ని సీజన్ లలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడు జరగలేదనే చెప్పాలి. మొదటి నుండి మంచి టీఆర్పీతో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ సీజన్ చివరికి ఇలా అయిందంటు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంత దారుణంగా చేస్తారా షోని షో లాగా, గేమ్ ని గేమ్ లాగా చూడాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ ని విన్నర్ ని చేసిన తన ఫ్యాన్సే ఇలా చేసి తనని చిక్కులో నెట్టారు. బిగ్ బాస్ సీజన్‌లో కామన్ మ్యాన్ కేటగిరీలో రైతుబిడ్డగా అడుగుపెట్టి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ కి విన్నర్ అయిన ఆనందాలని కొన్ని గంటలు కూడా ఉంచలేదు ఫ్యాన్స్. మితిమీరిన అభిమానం కూడా పనికిరాదని మరోసారీ ఈ డై హార్డ్ ఫ్యాన్స్ ఋజువు చేశారు. కాగా పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.