English | Telugu
ముకుందని రెచ్చగొట్టేలా మాట్లాడిన మురారి!
Updated : Sep 2, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -251లో.. మురారికి కృష్ణ ఇంజక్షన్ వేయాలని చెప్పగానే.. మురారికి భయం వేస్తుంది. అక్కడ నుండి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే కృష్ణ ఆపుతుంది. మురారి తప్పించుకొని అటు వైపు ఇటు వైపు వెళ్తూ ఉంటాడు. మురారిని కృష్ణ ఆపుతుంది. దంతో కృష్ణ పడిపోతుంటే మురారి పట్టుకుంటాడు. అప్పుడే కృష్ణ కళ్ళలోకి చూస్తూ ఉన్న మురారికి తనకి తెలియకుండానే ఇంజక్షన్ వేస్తుంది కృష్ణ.
మరొక వైపు కృష్ణ మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చిందని ముకుంద అనుకుంటుంది. కృష్ణని మురారి ప్రేమిస్తున్నట్లు తెలిసిపోయిందా? ఇదంతా రేవతి అత్తయ్య ప్లాన్ అయి ఉంటుంది. ఎలాగైనా మురారిని నా సొంతం చేసుకోవాలి. అది మా నాన్న వల్లే అవుతుంది. పెద్ద అత్తయ్య కి మా ప్రేమ విషయం చెప్పమని మా నాన్నతో చెప్పాలని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు మురారికి కృష్ణ జ్యూస్ తీసుకొని వెళ్తుంది. కావాలనే మురారి కృష్ణని కాసేపు ఆటపట్టిస్తాడు.. ఆ తర్వాత నువ్వు నా ఆరోగ్యం కోసం ఇక్కడికి వచ్చావ్ కదా అని మురారి అడుగుతాడు. నా ప్రేమ విషయం తెలుసుకోవడానికి ఇలా అంటున్నారా? నేను ఎందుకు చెప్తానని కృష్ణ అనుకొని నా స్వార్థం కోసం వచ్చానని కృష్ణ అంటుంది. ఏంటని మురారి అడిగితే.. మేరే కనుక్కోండని కృష్ణ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కృష్ణ క్యాంపు నుండి వచ్చినప్పటి నుండి తనలో చాలా మార్పు వచ్చింది హ్యాపీగా ఉంటుందని మురారి అనుకుంటాడు. అప్పుడే మురారి దగ్గరికి ముకుంద వస్తుంది. తనని చూసిన మురారి.. ఫొటోస్ చూపిస్తా అని నన్ను టెన్షన్ పెడతావా? నీ సంగతి చెప్తా అని మురారి అనుకుంటాడు. ఇందాక కృష్ణ జ్యూస్ తీసుకొని వచ్చింది తను తాగి నాకు మిగతా గ్లాస్ ఇచ్చింది. అది నేను తాగాను చాలా బాగుంది. అంతే కాకుండా నా షర్ట్ పై జ్యూస్ పడితే తనే క్లీన్ చేసిందని ముకుందని రెచ్చగొట్టేల మురారి మాట్లాడతాడు. నువ్వేం చెయ్యలేవు ఫొటోస్ చూపిస్తా అని నన్ను బెదిరించావ్ ? ఎం జరిగింది ఇక ముందు కూడా అలాగే జరుగుతుందని మురారి అంటాడు. అలా మురారి అనేసరికి ముకుందకి కోపం పెరిగిపోతుంది.
మరొక వైపు కృష్ణ దగ్గరకి రేవతి వచ్చి.. నీ ప్రేమ విషయం ఏమైనా మురారి బయటపెట్టడా అని రేవతి అడుగుతుంది. లేదని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత భవాని వచ్చి.. రేపు ఏంటి స్పెషల్ అని అడుగుతుంది. రేపు వరలక్ష్మి వ్రతమని కృష్ణ చెప్తుంది.. వరలక్ష్మి వ్రతం గురించి కృష్ణ ఇంట్లో అందరికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.