English | Telugu
పూజ మూర్తి ఇంట విషాదం... బిగ్ బాస్ షో క్యాన్సిల్!
Updated : Sep 2, 2023
సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది. ఆదివారం సాయంత్రం కర్టెన్ రైజర్ ఎపిసోడ్ తో లాంఛ్ కాబోతోంది. ఐతే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ ఐన ఈ టైములో అనుకోకుండా ఒక హౌస్ మేట్ ఎంట్రీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరుకు చెందిన పూజా మూర్తి మనకు బాగా తెలిసిన నటి. తెలుగు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కన్నడ సీరియల్స్ లో నటించిన తర్వాత తెలుగులో "గుండమ్మ కథ" అనే సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. జీ తెలుగులో ప్రసారమైన ఈ సీరియల్ కు మంచి టీఆర్పీ కూడా వచ్చింది. ఇక యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసిన "సూపర్ క్వీన్" ప్రోగ్రామ్ లో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది. ఐతే ఈమెను బిగ్ బాస్ సీజన్ 7లో తీసుకోవాలని నిర్వాహకులు అనుకున్నారు అంతా కరెక్ట్ గా సెట్ అయ్యింది అనుకున్న టైంలో వాళ్ళ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
బిగ్ బాస్ షో కోసం డ్యాన్స్ కూడా నేర్చుకుంది. అంతా బాగుందనుకుకున్న సమయంలో చివరి నిముషంలో పూజ మూర్తి తండ్రి మరణించినట్లుగా న్యూస్ వచ్చేసరికి ఆమె షో క్యాన్సిల్ చేసుకుంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్టు పెట్టింది. తన తండ్రితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి... తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. "మీరు నా పక్కన లేరనే బాధను ప్రతి సెకను ఫీల్ అవుతున్నాను.. మిమ్మల్ని ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటాను.. మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను.. తెలిసి తెలియక చేసిన ఏదైనా పొరపాటు చేసి ఉంటే సారీ.. మీరు ఎప్పుడు నాతోనే ఉంటారు.. మీ ఆశీస్సులు నాతోనే ఉంటాయి... నా మీద... అమ్మ మీద మీ ఆశీస్సులు నిరంతరం ఉంటాయి... రెస్ట్ ఇన్ పీస్ డాడీ" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.