English | Telugu

బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చిన అంజలి పవన్

బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కావడానికి ఇంకా ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. అలాంటి టైములో ఒక యంగ్ అండ్ డైనమిక్ పెయిర్ హౌస్ లోకి రాము అంటూ చెప్పేసింది. బిగ్ బాస్ 6 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు న్యూ సీజన్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సారి ఉల్టా పల్టా అంటూ సరికొత్త వెర్షన్ లో రాబోతుంది. ఆరో సీజన్ పై ఆడియన్స్ నుంచి బాగా నెగిటివిటీ రావడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఈ సారి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయింది. ఇక ఈ షోకి బిగ్ బాస్ లోకి సీరియల్ నటి, యూట్యూబర్ అంజలి పవన్ వెళ్తున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే బిగ్ బాస్ టీం సంప్రదించి.. ఆమెతో ఒప్పందం కూడా చేసుకున్నారట. ఐతే అనుకోని కారణంతో ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదనే విషయం తెలుస్తోంది. ఆమె పలు సీరియల్స్ లో నటిస్తూ... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.

రీసెంట్ గా "నీతోనే డాన్స్" షోలో ఈ జంట అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫైనల్స్ వరకు వెళ్లారు. ఈ షో ఎన్నాళ్ళు ఈ జంటకి నటరాజ్ మాష్టర్ జంట మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా ఉండేది. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ టీం ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మొగలి రేకులు సీరియల్‌తో అంజలి పవన్‌ బాగా పాపులర్ అయ్యింది. మధ్యమధ్యలో సినిమాల్లో కూడా నటిస్తూ మంచి ఇమేజ్ దక్కించుకుంది. కొంతకాలం క్రితం ప్రసారమైన మిస్టర్ అండ్ మిసెస్ షోలో కూడా ఈ జంట మెరిసింది. వీళ్లిద్దరికీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే వీళ్ళ కూతురు ధన్వికతో కలిసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.