English | Telugu
మా అమ్మకు దూరంగా ఉండండి
Updated : Sep 2, 2023
అనసూయ భరద్వాజ్ ఎప్పుడైతే బుల్లితెరను వదిలిపెట్టేసిందో అప్పటినుంచి మూవీస్ లో నటిస్తూ మంచి మంచి షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. అసలు ఈ చీర కట్టులో కుందనపు బొమ్మలా ఉంది అనసూయ . ఐతే ఉప్పల్ లో ఉన్న ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేసింది అనసూయ. ఈ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడి స్టాఫ్ అంతా కూడా ఆమెతో కల్సి ఫోటోలు, సెల్ఫీలు దిగారు.
అందులో ఒక పిక్ భలే అమేజింగ్ గా ఉంది. తాను ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న కుక్కపిల్ల కూడా తనతో వచ్చి కెమెరాకు పోజులు ఇచ్చింది. అనసూయకు మూగ జీవాలంటే ఎంతో ఇష్టం. తన ఇంట్లో అన్ని రకాల మూగజీవులు కనిపిస్తాయి. "చూడండి నాతో పాటు ఎవరు ఫోటో దిగుతున్నారో చూడండి " అని అనసూయ కామెంట్ పెట్టేసరికి ఆ కుక్కపిల్ల కూడా ఒక కామెంట్ పెట్టింది "మా అమ్మకు దూరంగా ఉండండి". ఈ పిక్ ని అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. అనసూయ సోషల్ మీడియాలో ఏ పిక్ పెట్టిన, ఏ వీడియో పెట్టినా అది ఫుల్ వైరల్ ఐపోతుంది. మూవీస్ లో కూడా ఆమెకు లీడ్ రోల్స్ వస్తున్నాయి. రంగస్థలం మూవీ ఆమె కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. దాంతో డైరెక్టర్ సుకుమార్ పుష్ప లో మరో క్రేజీ రోల్ ఆఫర్ చేశారు. పుష్ప 2లో సైతం అనసూయ సందడి చేయబోతోంది. జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి అడపాదడపా వస్తున్నారు కానీ అనసూయ వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారి కూడా షోలో ఒక్క ఎపిసోడ్ లో కూడా మెరవలేదు.