English | Telugu

కావ్య చేసే వరలక్ష్మి వ్రతంలో రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -190 లో.. అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. అప్పు ఫోన్ చేస్తే కళ్యాణ్ ఫోన్ కట్ చెయ్యడం తో అప్పు కోపంగా ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ అనామికని కలిసాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. సారీ అని చెప్తాడు. నాకు ఇంకొక ఫ్రెండ్ దొరికిందని కళ్యాణ్ అనగానే.. తను నేను ఒకటేనా అని అప్పు అడుగుతుంది. లేదు తను నా అభిమాని. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అని చెప్తాడు. ఆ తర్వాత అనామికతో మాట్లాడిందంతా అప్పుకి కళ్యాణ్ చెప్తాడు.

మరొక వైపు కనకం, కృష్ణమూర్తిలకి ఇందిరాదేవి ఫోన్ చేస్తుంది. రేపు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. మీరు తప్పకుండా రండి అని వారిద్దరిని ఇందిరాదేవి పిలుస్తుంది. మొన్న అంత గొడవ జరిగింది. మళ్ళీ మేము ఎలా రాగలమని కనకం అంటుంది. అదంతా మర్చిపోండి మీరు రేపు వచ్చి కావ్యతో వరలక్ష్మి వ్రతం జరిపించండని ఇందిరాదేవి చెప్పగా.. దానికి కనకం సరే అంటుంది. మరొక వైపు కావ్య దగ్గరికి అపర్ణ వస్తుంది. నిన్ను నేను ఎప్పటికి కోడలిగా అంగీకరించను నువ్వు ఒక్కసారి నాకు ఎదరు తిరిగినందుకు నిన్ను ఇంటి బయట నిలబెట్టాడు నా కొడుకు అని అపర్ణ అంటుంది. నన్ను అర్థం చేసుకోండని కావ్య అనగానే.. నిన్ను అర్థం చేసుకోవడానికి నువ్వేమైనా పుస్తకమా అని కావ్యని తక్కువ చేసి మాట్లాడుతుంది అపర్ణ. మీరు అనుకున్నది ఏది జరగట్లేదు. మీరు వద్దన్న ప్రతీసారి నాకు అణుకువగా జరుగుతుందని కావ్య అంటుంది. మామయ్య గారు చెప్తే వినట్లేదు. మీ అబ్బాయి చెప్తే వింటారెమో అని కావ్య అనగానే.. అక్కడ ఉంది నా కొడుకు అని అపర్ణ పొగరుగా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఆ మాటలు అన్ని రాజ్ వింటాడు. కావ్య వెళ్తుంటే పూజ నువ్వు చేయు, ప్రతిఫలం నేను ఇస్తానని రాజ్ అంటాడు. ఏంటని కావ్య అడుగుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సి అని రాజ్ చెప్పేసి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత మరుసటి రోజు కావ్య పూజకి అంతా సిద్ధం చేస్తుంది. వరలక్ష్మి అమ్మవారిని కావ్య బాగా అలంకరణ చేస్తుంది. బాగా చేసావని కావ్యని ఇందిరాదేవి మెచ్చుకుంటుంది.. దానికి కూడా అపర్ణని రెచ్చగొట్టాలని‌ రుద్రాణి ప్రయత్నం చేస్తుంది..కానీ ఇందిరాదేవి గొడవ కాకుండా ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.