English | Telugu

మా నాన్న కల ఫుల్ ఫిల్ చేశాను!


ఫైమా‌ పటాస్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికీ సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చింది. అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో తనేంటో నిరూపించుకుంది. అలా బుల్లితెరపై నవ్వులు పూయించిన ఫైమాకి బిగ్ బాస్ సీజన్-6 లో అవకాశం లభించింది.

బిగ్ బాస్ హౌస్ లోకి కమెడియన్ గా అడుగుపెట్టిన ఫైమా.. హౌస్ లో నవ్వులు పూయించింది. అయితే ఒకానొక దశలో తను వేసే పంచులు ఎదుటివారిని ఇబ్బంది పెడతాయని అప్పుడే తెలిసింది. దాంతో హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఫైమాకి అలా వెటకారంగా మాట్లాడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయిన తను మారలేదు. దాంతో ప్రేక్షకులలో ఫైమాపై నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిందనే చెప్పాలి. దాంతో బిగ్ బాస్ వీక్లీ వైజ్ ఎలిమినేషన్ లో ఫైమా బయటకొచ్చింది. అయితే ఫైమా తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఆ ఫ్యాన్స్ ఫైమా బయటకొచ్చాక గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్పారు. దీంతో అందరి దృష్టి ఫైమా మీద పడింది. అలా ఫైమా ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఆ తర్వాత బిబి జోడీలో సూర్య తో కలిసి డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది. దీంతో ఫైమాకి ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. అయితే ఫైమా తన గురించి ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది..

ఫైమా తాజాగా తన యూ ట్యూబ్ లో ఒక వీడియో నీ అప్లోడ్ చేసింది తన సొంత ఇల్లు కల ఇల్లు కట్టుకోవడం అంటూ ఫైమా చాలా సందర్భాలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తన సొంత ఇల్లు పూర్తయి, తన ఇంటి లైట్స్ ఫిట్ చేసింది ఫైమా. తన నాన్న చేతుల మీదగా స్విచ్ వేయించి, నాన్న కలని ఫుల్ ఫిల్ చేశానని ఒక వీడియోని అప్లోడ్ చేసింది. ఇలా చేయడం నిజంగా పిల్లల్ని కన్న ప్రతీ తల్లిదండ్రులకి గర్వంగా ఉంటుందంటూ నెటిజన్లు ప్రశంసలు అందిస్తున్నారు.