English | Telugu

వ‌రుణ్‌తో దిల్ రాజు బాలీవుడ్ మూవీ.. రంగంలోకి శైలేష్‌

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోని అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో హిట్ సినిమాను హిందీలో నిర్మించిన ఈ స్టార్ ప్రొడ్యూస‌ర్ ఇప్పుడు మ‌రో బాలీవుడ్ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో హీరో ఎవ‌రో కాదు.. వ‌రుణ్ ధావ‌న్‌. మ‌రి ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. శైలేష్ కొల‌ను. క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ అయిన హిట్‌, హిట్ 2 సినిమాల‌ను తెర‌కెక్కించి వ‌రుస విజ‌యాల‌ను ఈ డైరెక్ట‌ర్ సొంతం చేసుకున్నారు. ఇప్ప‌డు విక్ట‌రీ వెంక‌టేష్‌తో సైంధ‌వ్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబ‌ర్ 22న రిలీజ్ కానుంది. ఇది మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కనుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిహారిక ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది.

అతిలోక సుంద‌రితో పోలిక‌... ఎమోష‌న‌ల్ అయిన జాన్వీ!

జాన్వీక‌పూర్ ఇప్పుడు ఇండియాలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ యాక్ట్రెస్‌. 2018లో ధ‌డ‌క్ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ క‌పూర్‌. ఇషాన్ కట్ట‌ర్ హీరోగా న‌టించిన ఆ సినిమాకు శ‌శాంక్ ఖైతాన్ తెర‌కెక్కించారు. తొలి సినిమాలోనే ఆమె యాక్టింగ్ బ్రిలియ‌న్స్ కి, సింప్లిసిటీకి ఫుల్ మార్కులు ప‌డ్డాయి. అతిలోక సుంద‌రి కూతురంటే ఆ మాత్రం ఉంటుంద‌ని అంద‌రూ మెచ్చుకున్నారు. అలా ఒక్కో అడుగు వేస్తూ రీసెంట్‌గా బ‌వాల్ మూవీ చేశారు జాన్వీ క‌పూర్‌. నితీష్ తివారి తెర‌కెక్కించిన సినిమా అది. ఈ చిత్రంలో పెళ్ల‌యిన యువ‌తిగా క‌నిపించారు జాన్వీక‌పూర్‌. ఆమె న‌ట‌న‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బ‌వాల్‌లో నిషాగా ఆమె న‌ట‌న‌ను, ఇంగ్లిష్ వింగ్లిష్‌లో శ‌శి కేర‌క్ట‌ర్‌లో క‌నిపించిన శ్రీదేవి న‌ట‌న‌తో పోలుస్తున్నారు. ఆ మెసేజ్‌లు చ‌దివి ఎమోష‌న‌ల్ అయ్యారు జాన్వీ క‌పూర్‌. 

‘లైగర్’ బ్యూటీ రిలేషన్ షిప్.. తండ్రి కామెంట్స్

బాలీవుడ్ హీరోయిన్స్ చుట్టూ ల‌వ్ మేట‌ర్స్ ఉండ‌టం అనేది కామ‌న్‌. ఈ వార్త‌ల‌తో వాళ్లు ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా ఆ లిస్టులో చేరిన ముద్దుగుమ్మ అన‌న్య పాండే. కెరీర్ స్టార్టింగ్‌లో మ‌రొక‌రితో ప్రేమాయ‌ణం సాగించిన లైగ‌ర్ బ్యూటీ రీసెంట్‌గా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ క‌పూర్‌తో ప్రేమ‌లో మునిగింది. ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. వారిద్ద‌రికీ సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటారంటూ బాలీవుడ్‌లో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై అన‌న్య పాండే తండ్రి, సీనియ‌ర్ న‌టుడు చంకీ పాండే స్పందించారు.