English | Telugu

జ‌వాన్ మీద అంచ‌నాలు పెంచుతున్న షారుఖ్‌

జ‌వాన్ మీద అంచ‌నాలు పెంచుతున్న షారుఖ్‌

నాలుగేళ్ల త‌ర్వాత ప‌ఠాన్‌తో హిట్ అందుకున్నారు హీరో షారుఖ్ ఖాన్‌. ఆ సినిమా టైమ్‌లోనే నెటిజ‌న్ల ప‌ల్స్ ప‌ట్టుకున్నారు. ఇప్పుడు జవాన్ విష‌యంలోనూ అదే స్ట్రాట‌జీ ప్లే చేస్తున్నారు. ఈ ఏడాది విడుద‌ల కానున్న సినిమాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా జ‌వాన్‌కి పేరుంది. జూన్ 10న ప్రివ్యూ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి సినిమా మీద అంచ‌నాలు చాలా పెరిగిపోయాయి. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌లో షారుఖ్ న్యూ లుక్ చూసి ఆనంద్ మ‌హీంద్ర చేసిన కామెంట్ ఇన్‌స్టంట్‌గా వైర‌ల్ అయింది. అంద‌రికీ ఏజ్ పెరుగుతుంటే, షారుఖ్‌కి ఏజ్ త‌గ్గుతోంద‌ని ఆయ‌న అన్న మాట‌లు కింగ్‌ఖాన్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చాయి. దీనికి తోడు ఇప్పుడు షారుఖ్ షేర్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. జ‌వాన్ సినిమా కౌంట్ డౌన్‌ని ప్ర‌స్తావిస్తూ చేసిన వీడియో అది. దాన్ని షేర్ చేస్తూ ``30 డేస్ టు గో... దీస్ టూ షల్ పాస్... టిక్‌..టాక్‌..`` జ‌వాన్ కోసం వెయిట్ చేయ‌మ‌ని త‌న‌దైన స్టైల్‌లో చెప్పారు షారుఖ్‌. జ‌వాన్ విడుద‌ల‌కు ఇంకా నెల రోజులు ఉంద‌న్న విష‌యాన్ని గుర్తుచేశారు. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది జ‌వాన్‌. హిందీ, త‌మిళ్‌, తెలుగులో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

షారుఖ్ ఈ వీడియో షేర్ చేయ‌గానే అరే..రెడీ రెడీ అని ఒక‌రు, కాంట్ వెయిట్ సార్ అని మరొక‌రు, రెస్పెక్ట్ బ‌ట‌న్ ఫ‌ర్ ఎస్ ఆర్ కె అని ఇంకొక‌రు, బాలీవుడ్ ఫాద‌ర్ షారుఖ్ అని ఇంకొక‌రు, ఇలా ఎవ‌రికి తోచిన రీతిలో వాళ్లు ఒపీనియ‌న్స్ షేర్ చేస్తున్నారు. జ‌వాన్ సినిమాను షారుఖ్ స‌తీమ‌ణి గౌరీఖాన్ తెర‌కెక్కిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌. న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, ప్రియ‌మ‌ణి, సాన్యా మ‌ల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవ‌ర్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. దీపిక ప‌దుకోన్ ఈ సినిమాలో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇచ్చారు.