English | Telugu

‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘జవాన్’. కోలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ సినిమాను తెర‌కెక్కించారు. సెప్టెంబ‌ర్ 7న తెలుగు, తమిళ‌, హిందీ భాష‌ల్లో మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీతో షారూఖ్ సౌత్ మార్కెట్‌పై గ్రిప్ పెంచుకోవాల‌నుకుంటున్నారు. అందుక‌నే డైరెక్ట‌ర్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం, సాంకేతిక నిపుణులంద‌రినీ ఇక్క‌డి వారినే తీసుకున్నారు. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని ఎంటైర్ కోలీవుడ్ ఇండ‌స్ట్రీ కోరుకుంటోంది. అందుకు కార‌ణం.. ఒక‌ప్పుడు బాలీవుడ్ త‌ర్వాత కోలీవుడ్ సినిమానే అన్నట్లు ఉండేది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్‌నే డామినేట్ చేసి పారేస్తుంది. దీంతో కోలీవుడ్ మేక‌ర్స్ పోటీ ప‌డీ మ‌రీ సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ నుంచి విక్ర‌మ్‌, జైల‌ర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.

ర‌ణ్‌వీర్‌ని చూస్తే భ‌యం లేదంటున్న డైర‌క్ట‌ర్‌

ర‌ణ్‌వీర్‌ని చూస్తే నాకేం భ‌యం అనిపించ‌డం లేద‌ని చెబుతున్నారు డైర‌క్ట‌ర్ ఫ‌ర్హాన్ అక్త‌ర్‌. ర‌ణ్‌వీర్ హీరోగా డాన్‌3 మూవీని అనౌన్స్ చేశారు ఫ‌ర్హాన్‌. డాన్ ఫ్రాంఛైజీలో ఇంత‌కు పూర్వం అమితాబ్ బ‌చ్చ‌న్‌, షారుఖ్ ఖాన్ నటించారు. ఇప్పుడు మూడో చాప్ట‌ర్‌లో ర‌ణ్‌వీర్ న‌టించ‌నున్నారు. ఫ‌ర్హాన్ అక్త‌ర్ నార్త్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్ రివీల్ చేశారు. ``న్యూ డాన్‌గా ర‌ణ్‌వీర్‌ని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ర‌క‌ర‌కాల రియాక్ష‌న్స్ వ‌స్తున్నాయి. వెర్స‌టైల్ యాక్టర్స్ ప్లేస్‌ని ఎందుకు ర‌ణ్‌వీర్‌కి ఇచ్చారంటూ ప‌లు ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. అయితే నేను వాటి గురించి అస‌లు ఆలోచించ‌డం లేదు. ఎందుకంటే, నాకు ర‌ణ్‌వీర్ మీద కించిత్తు అనుమానం కూడా లేదు. అద్భుతంగా న‌టిస్తాడు. నేచుర‌ల్‌గా పెర్ఫార్మ్ చేస్తాడ‌నే భ‌రోసా ఉంది. 

జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్న స‌ల్మాన్‌ఖాన్‌!

స‌ల్మాన్ గ‌త కొన్నాళ్లుగా స్క్రిప్టులు చ‌ద‌వ‌డంలోనే బిజీగా ఉండిపోయారు. ఆయ‌న న‌టిస్తున్న టైగ‌ర్‌3 ప్ర‌స్తుతం సెట్స్ మీదుంది. ఈ సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న విష్ణువ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌. ఈ సినిమా కోసం ఆల్రెడీ స‌ల్మాన్‌ఖాన్ ప్రిపరేష‌న్ మొద‌లుపెట్టేశారు. నవంబ‌ర్‌లో ఈ సినిమా షెడ్యూల్‌ని ప్రారంభించాల‌న్న‌ది స‌ల్మాన్ ప్లాన్‌. స‌ల్మాన్ ఖాన్ ఈ సినిమాలో పారా మిలిట‌రీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తారు. అందుకు త‌గ్గ‌ట్టు లుక్ వైజ్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్ప‌టికే బ‌రువు కూడా త‌గ్గుతున్నారు. ఈ ప‌నుల‌న్నీ ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. మ‌ల్టిపుల్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు విష్ణువ‌ర్ధ‌న్‌. వ‌చ్చే ఏడాది క్రిస్మ‌స్‌కి ఈ సినిమాను విడుద‌ల చేయాల‌న్న‌ది విష్ణువ‌ర్ధ‌న్ ప్లాన్‌.

ఓ మైగాడ్‌2 ని నిర్మాత‌లు ఎందుకు ఒప్పుకోలేదు?

అక్ష‌య్‌కుమార్‌, పంక‌జ్ త్రిపాఠి న‌టించిన సినిమా ఓ మైగాడ్ 2. ఈ సినిమాకు అమిత్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా మెటీరియ‌లైజ్ కావ‌డానికి ముందు ప‌లువురు నిర్మాత‌లు ఈ స్క్రిప్ట్ ని రిజ‌క్ట్ చేశార‌ట‌. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్‌లో స‌క్సెస్ అయిన స‌బ్జెక్టుల్లో ఓ మై గాడ్ 2 కూడా ఒక‌టి. ఈ సినిమా వంద కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. పంక‌జ్ త్రిపాఠి, యామీ గౌత‌మ్ కీ రోల్స్ చేశారు. అక్ష‌య్ ఈ ప్రాజెక్టుకి ఓ నిర్మాత‌. వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, వ‌కావూ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి డిస్క‌స్  చేశారు. ఈ అటెంప్ట్ ని మెచ్చుకున్నారు అక్ష‌య్‌. సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డానికి ముందుకొచ్చారు.