English | Telugu
షారుఖ్ ప్లేస్‌ని కబ్జా చేసిన రణ్‌వీర్‌సింగ్!
Updated : Aug 8, 2023
రణ్‌వీర్‌సింగ్ జోష్ మామూలుగా లేదు. నెక్స్ట్ అనౌన్స్ మెంట్‌కి ఆయన అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఆ అనౌన్స్‌మెంట్‌కి షారుఖ్‌తో లింక్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
షారుఖ్ ఖాన్ నటించిన డాన్ ఫ్రాంఛైజీ గుర్తుంది కదా. ఇప్పుడు అందులో నుంచి ఆయన తప్పకుంటున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి తన విల్లింగ్‌ని చెప్పేశారు రణ్‌వీర్‌సింగ్. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో థర్డ్ జనరేషన్ డాన్‌గా రణ్‌వీర్ కనిపించనున్నారు. ఆల్రెడీ అమితాబ్, షారుఖ్ చేసిన పాత్రలే ఇవి. ఇప్పుడు వారిద్దరి తర్వాత రణ్‌వీర్ ఆ ప్లేస్‌ని ఫిల్ చేయబోతున్నారు. ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ వీడియో కోసం షూటింగ్ కూడా జరిగిందట. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
``డాన్3 టీజర్ ఈ వారమే డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రణ్‌వీర్‌సింగ్‌ని డాన్‌గా పరిచయం చేయడానికి టీమ్ చాలా ఎగ్జయిట్ అవుతోంది. ప్రాపర్ టీజర్‌తో ఈ ఇంట్రడక్షన్ కార్యక్రమం జరుగుతుంది. రెండు, మూడు రోజుల్లో దానికి సంబంధించిన విషయాలను కూడా అధికారికంగా ప్రకటిస్తారు. ఆల్రెడీ షూట్ చేసిన వీడియోలో రణ్‌వీర్ ఉబర్ కూల్ అవతార్‌లో కనిపిస్తారు. డాన్ కేరక్టర్‌కి కొత్త డైమన్షన్‌ని ఇంట్రడ్యూస్ చేసేలా ఉంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్``... అని ముంబై సోర్సు. ఇండిపెండెన్స్ డే వీక్‌లో గదార్ 2 సినిమా విడుదల కానుంది. ఆ సినిమాతోనే ఈ టీజర్‌ని థియేటర్లలో ప్లే చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గదార్2తో పాటు రణ్‌వీర్‌సింగ్ సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ఆడుతున్న థియేటర్లలోనూ, ఓఎంజీ2 థియేటర్లలోనూ ప్లే చేస్తారు. డాన్3ని 2025లో విడుదల చేయాలనుకుంటున్నారు ఫర్హాన్ అక్తర్.
