English | Telugu

‘లైగర్’ బ్యూటీ రిలేషన్ షిప్.. తండ్రి కామెంట్స్

‘లైగర్’ బ్యూటీ రిలేషన్ షిప్.. తండ్రి కామెంట్స్

బాలీవుడ్ హీరోయిన్స్ చుట్టూ ల‌వ్ మేట‌ర్స్ ఉండ‌టం అనేది కామ‌న్‌. ఈ వార్త‌ల‌తో వాళ్లు ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా ఆ లిస్టులో చేరిన ముద్దుగుమ్మ అన‌న్య పాండే. కెరీర్ స్టార్టింగ్‌లో మ‌రొక‌రితో ప్రేమాయ‌ణం సాగించిన లైగ‌ర్ బ్యూటీ రీసెంట్‌గా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ క‌పూర్‌తో ప్రేమ‌లో మునిగింది. ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. వారిద్ద‌రికీ సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటారంటూ బాలీవుడ్‌లో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై అన‌న్య పాండే తండ్రి, సీనియ‌ర్ న‌టుడు చంకీ పాండే స్పందించారు.

‘‘సినిమా ఇండ‌స్ట్రీ అంటే గ్లామ‌ర్ ప్ర‌పంచం. ఇక్క‌డ ఉండే న‌టీన‌టులు రిలేష‌న్ షిప్‌లో ఉన్నారంటూ వార్త‌లు రావ‌ట‌మ‌నేది సాధార‌ణంగా జ‌రిగే విష‌యం. ఇలాంటి వార్త‌లు న‌టీన‌టులుకు అప్పుడ‌ప్పుడు న‌ష్టాన్ని కలిగిస్తాయి. టైగ‌ర్ ష్రాఫ్‌తో క‌లిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, కార్తీక్ ఆర్య‌న్‌తో క‌లిసి ప‌తీ పత్ని ఔర్ వో సినిమాల్లో చ‌క్క‌గా న‌టించింది. ఈ విష‌యంలో ఎవ‌రినీ వ్య‌తిరేకించాల్సిన అవ‌స‌రం లేదు. అన‌న్య అన్ని విష‌యాల్లో నా కంటే మెరుగ్గా ఉండాల‌ని కోరుకుంటున్నాను’’  అన్నారు చంకీ పాండే.
 
అన‌న్య పాండే కేవ‌లం హిందీ సినిమాల‌తో పాటు పాన్ ఇండియా మూవీగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి లైగ‌ర్ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేద‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అన‌న్య న‌టించిన‌ డ్రీమ్ గ‌ర్ల్ 2 ఆగ‌స్ట్ 25న విడుద‌ల కానుంది.