English | Telugu

క్రిష్‌.. టైటిల్ సీక్రెట్ రివీల్ చేసిన గ్రీక్ గాడ్‌!

క్రిష్‌.. టైటిల్ సీక్రెట్ రివీల్ చేసిన గ్రీక్ గాడ్‌!

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ త‌న క్రిష్ మూవీ గురించి చెప్పిన విష‌యాలు నార్త్ లో వైర‌ల్ అవుతున్నాయి. కోయి మిల్‌గ‌యా సినిమా విడుద‌లై రెండు ద‌శాబ్దాలు పూర్త‌యిన సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేశారు. ఈ నెల 10 వ‌ర‌కు థియేట‌ర్ల‌లో అందుబాటులో ఉంటుంది ఈ సినిమా. ఈ సంద‌ర్భంగా కోయి మిల్‌గ‌యా, క్రిష్ సినిమాల‌కు సంబంధించి హృతిక రోష‌న్‌, రాకేష్ రోష‌న్ చాలా విష‌యాల‌ను పంచుకున్నారు.

క్రిష్ సినిమాకు టైటిల్ పెట్టిందే హృతికేన‌ట‌. ఈ విష‌యాన్ని రాకేష్ వెల్ల‌డించారు. ``నేను ఈ పార్ట్ కి ఇంకో టైటిల్ అనుకున్నాను. కానీ హృతిక్ మాత్రం క్రిష్ అని పెట్ట‌మ‌ని ప‌ట్టుబ‌ట్టాడు. ఇప్పుడు క్రిష్ అనే పేరు తెలియ‌నివారే లేరు`` అని అన్నారు. దీని గురించి హృతిక్ మాట్లాడుతూ ``ఈ సినిమాలో సింబాలిక్ సూప‌ర్‌హీరో ఉంటాడు. ఆ సూప‌ర్‌హీరో పేరు మ‌న నాలుక‌ల మీద నాట్యం చేసిన పేరై ఉండాల‌నిపించింది. దానికి త‌గ్గ‌ట్టు సినిమాలో త‌ల్లి త‌న కొడుకుని ఐడెంటిటీ రివీల్ చేయొద్ద‌ని చెబుతుంది. స‌ర్క‌స్‌లో జ‌నాలు ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు పిల్లాడు కాపాడుతాడు. అత‌నికి ముఖానికి మాస్క్ ఉంటుంది. అప్పుడు అక్క‌డున్న‌వారిలో ఒక‌రు పిల్లాడి పేరు అడుగుతారు. కృష్ణ అని చెప్ప‌బోయి... క్రిష్ అని చెప్పి త‌ల్లి మాట గుర్తొచ్చి ఆపేస్తాడు. అలా క్రిష్ అనే ప‌దం జ‌నాల‌కు బాగా రిజిస్ట‌ర్ అవుతుంది. అందుకే అదే టైటిల్ పెడ‌దామ‌ని సూచించాను. కాస్త త‌ర్జ‌న‌భ‌ర్జ‌న త‌ర్వాత అంద‌రూ దీనికి ఒప్పుకున్నారు`` అని అన్నారు హృతిక్‌. ఆయ‌న ప్ర‌స్తుతం ఫైట‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. స్పై సినిమా ఇది. ఈ చిత్రం కోసం నార్త్ జ‌నాలు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫైట‌ర్ సినిమా త‌ర్వాత వార్‌2లో న‌టిస్తారు క్రిష్‌. ఇందులోనే ఎన్టీఆర్ న‌టించ‌నున్నారు. కియారా అద్వానీ నాయిక‌గా ఫిక్స్ అయ్యారు.