English | Telugu
ఓ మై గాడ్... అక్షయ్ ఆనందానికి అవధుల్లేవ్!
Updated : Aug 15, 2023
ఓ మై గాడ్ అంటూ ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు అక్షయ్‌కుమార్. ఒకటా, రెండా... ఎన్నెన్నో ఫ్లాపుల తర్వాత ఆయన్ని 'ఓఎంజీ2' రూపంలో హిట్ పలకరించింది. అందుకే సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరినీ పిలిచి ట్రీట్ ఇచ్చారు అక్షయ్. యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠితో పాటు సినిమా టీమ్ అందరూ ఖిలాడి ట్రీట్‌ని యమాగా ఎంజాయ్ చేశారు.
ఆగస్టు 11న విడుదలైంది ఓమైగాడ్2. ఇందులో శివదూతగా నటించారు అక్షయ్‌కుమార్. ఫస్ట్ పార్టులో నటించిన పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ కూడా నటించారు. ఈ సినిమాకు అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఆయన యూనిక్ స్టోరీ టెల్లింగ్ వల్లే సినిమా సక్సెస్ అయిందని అందరూ ముక్తకంఠంతో మెచ్చుకుంటున్నారు. అక్షయ్ ఇచ్చిన ట్రీట్‌లోనూ అందరూ డైరక్టర్‌ని పొగడ్తలతో ముంచెత్తారు.
ఇండిపెండెన్స్ డే రోజున బెంగుళూరులో ఓ మై గాడ్ 2 స్పెషల్ షోలు పడుతున్నాయి. తెల్లారుజామున రెండు గంటల నుంచే ఈ సందడి షురూ.
ఆదిపురుష్ సినిమాతో బోలెడన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సెన్సార్ బోర్డు, ఓ మై గాడ్2 విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించింది. ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఓ మై గాడ్ 2కి ఎ సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. అయినా సినిమా తలరాతను డిసైడ్ చేయాల్సింది ప్రేక్షకులేననే విషయం మరోసారి ప్రూవ్ అయిందని అంటున్నారు డైరక్టర్. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు.
