English | Telugu
ఫైటర్ గురించి హృతిక్ గర్ల్ ఫ్రెండ్ కామెంట్!
Updated : Aug 16, 2023
ప్రేమలో ఉన్నప్పుడు ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. ప్రతిదీ ప్రత్యేకంగా అనిపిస్తుంది. బెటర్ హాఫ్ ఏం చేసినా పొగడాలనిపిస్తుంది. ప్రోత్సహించాలనిపిస్తుంది. నువ్వేం చేసినా అందంగా ఉందని చెప్పాలనిపిస్తుంది. ఇవన్నీ వాళ్లకు ఎంత సహజమో, వాళ్లిద్దరూ ఒకరిని ఒకరు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడాలనుకోవడం ఆడియన్స్ కీ సహజమే. ఇప్పుడు హృతిక్‌నీ, ఆయన గర్ల్ ఫ్రెండ్‌నీ అంతే ఇష్టంగా అబ్జర్వ్ చేస్తున్నారు ఫ్యాన్స్. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది ఫైటర్. ఈ మోషన్ పోస్టర్ చూసి హృతిక్ గర్ల్ ఫ్రెండ్ సబా అజాద్ రియాక్ట్ అయ్యారు. హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ జంటగా నటిస్తున్న సినిమా ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
పఠాన్‌తో యమా సక్సెస్ అందుకున్న డైరక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. ఇప్పుడు ఏరియల్ యాక్షన్ ప్రాజెక్ట్ ఫైటర్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ కీ రోల్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైటర్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. హృతిక రోషన్, దీపిక, అనిల్ కపూర్ ఎయిర్ ఫోర్స్ యూనిఫార్మ్ లో చేతిలో హెల్ మెట్స్‌తో, సన గ్లాసెస్‌తో ఉన్న పోస్టర్ చూపరులను ఆకట్టుకుంటోంది. అందరూ వందేమాతరం అంటూ స్పందిస్తున్నారు. స్పిరిట్ ఆఫ్ ఫైటర్ పేరుతో వీడియో గ్లింప్స్ షేర్ చేశారు. వందేమాతరం అంటూ రాసుకొచ్చారు హృతిక్ రోషన్. ఈ పోస్టర్ కింద హృతిక్ లేడీ లవ్ సబా అజాద్ ఫైర్ ఎమోజీస్ జత చేశారు. అభిషేక్ బచ్చన్ కూడా రెయిజింగ్ హ్యాండ్స్ తో విష్ చేశారు. ఈ సినిమా తర్వాత వార్2లో నటిస్తారు హృతిక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కీ రోల్ చేస్తున్నారు.