English | Telugu

ల‌లిత్ మోడీతో డేటింగ్.. సుష్మితా సేన్ క్లారిటీ

ల‌లిత్ మోడీతో డేటింగ్.. సుష్మితా సేన్ క్లారిటీ

బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్ 'తాలీ' అనే సిరీస్ లో ట్రాన్స్‌జెండ‌ర్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ట్రాన్స్‌జెండ‌ర్‌..సామాజిక కార్య‌కర్త అయిన శ్రీగౌరి సావంత్ జీవితం ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ ను తెర‌కెక్కిస్తున్నారు. రీసెంట్‌గా వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్‌పై విమ‌ర్శలు వచ్చాయి. దీనిపై ఆమె రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ఇదే క్ర‌మంలో ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీతో డేటింగ్ విష‌యంపై కూడా ఆమె రియాక్ట్ అయ్యారు. 

"ప్ర‌స్తుతం ఎవ‌రితోనూ రిలేష‌న్‌లో లేను. సింగిల్‌గానే ఉంటున్నాను. విమర్శలు సాధారణంగా వస్తుంటాయి. అవి కూడా ఒకందుకు మంచివే. గోల్డ్ డిగ్గ‌ర్ అని విమ‌ర్శ‌లు చేశారు. దానికి అర్థ‌మేంటో తెలుసుకోగ‌ల‌ను. అయితే వాటికి అంత ప్రాధాన్య‌త ఇవ్వాల్సిన ప‌ని లేదు కాబ‌ట్టి నేను ఇవ్వ‌ను. ఎందుకంటే ఇది నా జీవితం దీని గురించి అంద‌రికీ తెలియాల్సిన అవ‌స‌రం లేదు. స‌మాధానాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా లేదు" అని అన్నారు.

'తాలీ' గురించి వచ్చిన విమ‌ర్శ‌ల‌పై కూడా సుష్మితా సేన్ రియాక్ట్ అయ్యారు. 'తాలీ' ఫ‌స్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన త‌ర్వాత నెటిజ‌న్స్ చాలా మంది అస‌భ్యంగా మాట్లాడారు. ఇలా ఎలా మాట్లాడుతున్నారనిపించింది అని అన్నారామె. 

గ‌త ఏడాది ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ లలిత్ మోడీ.. తాను సుష్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కూడా ప‌లువురు సుష్మిత డ‌బ్బు కోస‌మే ల‌లిత్‌కు గాల‌మేసిందంటూ కామెంట్స్ చేశారు. అయితే త‌ర్వాత ఏమైందో తెలియ‌దు కానీ.. ల‌లిత్ మోడీ త‌న ట్వీట్‌ను తొల‌గించారు. దీంతో డేటింగ్‌, పెళ్లి అంటూ చేసిన పోస్ట్‌కి అంత ప్రాధాన్య‌త లేద‌ని తేలిపోయింది.