English | Telugu

సుమ రీల్ చూసి ఆశ్చర్యపోయిన కుమారి ఆంటీ!

మీది మొత్తం 1000 అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ట్రా అని కుమారి ఆంటీ చెప్పిన వాయిస్ ని ప్రస్తుతం డీజే తో మిక్స్ చేశారు. అది ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. అయితే ఆ డీజే సాంగ్ కి సుమ రీల్ చేసింది‌. ఇందులో సుమ ఆ సాంగ్ కి తగ్గట్టుగా లిప్ సింక్ ఇచ్చేసరికి అది నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.

బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఇక కుమారీ ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయింది. ఈ క్రేజ్ తో తనకి బిబి మహోత్సవం అనే షోలో అఫర్ లభించింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో కుమారీ ఆంటీ రావడంతో రచ్చ మాములుగా లేదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో డీజే రిమిక్స్ రీల్స్,‌ సాంప్రదాయిని సుప్పిని సద్దపూసని అనే రీల్స్ హావా నడుస్తోంది. చిన్న చిన్న సెలబ్రిటీల నుండి అగ్రతారల వరకు ఇన్ స్ట్రాగ్రామ్ లో రకరకాల పోస్ట్ లు రీల్స్ చేస్తుంటారు. దీనికంతటికి కారణం ట్రెండింగ్ లో ఉండాలని అందరు చూస్తున్నారు.

ఇక కుమారీ ఆంటీ వాయిస్ ని డీజే రీమిక్స్ చేయగా అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సుమ చేసిన ఈ రీల్ కి తెగ కామెంట్లు వస్తున్నాయి. సుమ చేసిన ఈ రీల్ ని టేస్టీ తేజ స్వయంగా కుమారీ ఆంటీకి చూపించాడు. అది చూసి ఆశ్చర్యపోతూ చాలా ప్రౌడ్ గా ఉందంటూ కుమారీ ఆంటీ ఆ వీడియోలో అంది. ఆ వీడియోని టేస్టీ తేజ త‌న ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.