English | Telugu

పెళ్లి చేసుకుంటే ఫీలింగ్స్ చచ్చిపోతాయన్నారు అందుకే చేసుకోవట్లేదు....


హీరో నవదీప్ టాలీవుడ్ లో మంచి క్రేజీ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఓటిటి మీద రీసెంట్ న్యూసెన్స్ అనే మూవీతో హిట్ కొట్టిన నవదీప్ తర్వాత "డగ్ అవుట్" అనే షోతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఐతే నవదీప్ రీసెంట్ గా ఒక షోలో తన పెళ్ళికి సంబందించిన కొన్ని విషయాలు చెప్పాడు. "మీరు వెళ్లేందుకు చేసుకోవట్లేదు" అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు " పెళ్లి చేసుకోమని నన్ను నువ్వు ఎందుకు అడగడం లేదు...నా గురించి తెలుసుకుని ఎక్కువమంది వస్తున్నారు కానీ నా గురించి నేను చాలా తక్కువగా చెప్పుకుంటున్నాను.

నాలో ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో మీకెవ్వరికీ తెలీదు. ఫీలింగ్స్ ఎక్కువైపోయి పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఫీలింగ్స్ చచ్చిపోతాయని చెప్పారు ఎవరో అందుకే పెళ్లి చేసుకోవడం లేదు..పెళ్లి ఎందుకు చేసుకుంటున్నామో కరెక్ట్ రీజన్ తెలిసి ఆ టైం కరెక్ట్ అని ఆ మనిషి కరెక్ట్ అని అనిపించినప్పుడే పెళ్లి చేసుకోవాలి. కొంతమంది లైఫ్ స్టైల్ కి పెళ్లి ముందుగా జరుగుతుంది... కొంతమంది లైఫ్ స్టైల్ కి తర్వాత జరుగుతుంది..ఉదాహరణకు సల్మాన్ ఖాన్, ప్రభాస్.. నా మీద ఎన్ని కాంట్రోవర్సీలు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా ఇలా బయటకు వచ్చేస్తాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నామీద కేసులు కాదు న్యూసులు ఎక్కువ హడావిడి ఎక్కువ..నా వయసు 38 ...ఇండస్ట్రీలో ఆటగాడే అని మా రానా బాబుని చూసినప్పుడు అనిపిస్తుంది అది కూడా పెళ్ళికి ముందు. రీసెంట్ గా ఒక అమ్మాయి నుంచి నాకు బంపర్ ఆఫర్ వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటే ఇంత కట్నం గ్యారెంటీ అని ఆఫర్ ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా తెలిసిన అమ్మాయే ఒక పార్టీలో ఈ ఆఫర్ ఇచ్చింది. సెలబ్రిటీ స్టేటస్ అంతా బయట. ఇంట్లోకి వెళ్తే చాలు నన్ను తిట్టడం కోసమే మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది." అని చెప్పాడు. నవదీప్ తెలుగులో చందమామ, గౌతమ్ ఎస్ఎస్ సి లాంటి మూవీస్ లో నటించాడు. ఆ తర్వాత హీరోగా సరైన అవకాశాలు లేక ఆర్య, అలవైకుంఠపురంలో మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రల్లో నటించి అలరించాడు. ఐతే త్వరలో లవ్ మౌళి మూవీతో ఆడియన్స్ ముందు రాబోతున్నట్లు చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.