English | Telugu
ఎవర్రా మీరంతా.. ఇంత మూర్ఖంగా ఉన్నారు
Updated : Feb 11, 2024
బుల్లితెర మీద అందరూ ఒకెత్తు ఐతే రష్మీ గౌతమ్ మాత్రమే మరో ఎత్తు. కస్తూరి, చిన్మయి శ్రీపాద, అనసూయ వంటి వారిలా రష్మీ కూడా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. వచ్చిరాని తెలుగుతో యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ని తన తెలుగుతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. మొదట్లో "హోలీ" అనే మూవీలో ఒక చిన్న రోల్ లో కనిపించింది రష్మీ. ఆ తర్వాత కొన్ని మూవీస్ లో నటించింది. ఐతే రష్మీ గౌతమ్ కి సిల్వర్ స్క్రీన్ మీద కంటే స్మాల్ స్క్రీన్ మీద ఎక్కువ కంఫర్ట్ గా ఫీలవుతూ షోస్ చేస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ మూగ జీవాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. దేశంలో ఎక్కడ ఏ మూల వాటికి హాని తలపెట్టినట్టు కనిపించినా ఊరుకోదు... వెంటనే యాక్షన్ ప్లాన్ లోకి దిగిపోతుంది.
రీసెంట్ గా ట్విట్టర్ లో ఎవరో ఒక పర్సన్ ఒక ఏనుగును సూలంతో కాళ్లల్లో గుచ్చుతూ ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేశారు. దాన్ని రష్మీ రిపోస్ట్ చేసి "వాట్ ది హెల్ ఈజ్ దిస్. ఏంట్రా జనాలు ఇంత మూర్ఖంగా ఉన్నారు. దయచేసి ఎవరైనా వచ్చి సాయం చేయండి. మీ అందరికీ ఇప్పుడు అర్ధమవుతోందా మేము జంతువులను ఎంటర్టైన్మెంట్ రంగంలో రైడ్స్ లో ఎందుకు వినియోగించొద్దు అంటామో.. ఎందుకంటే అవి అంత ప్రెజర్ ని భరించలేవు...వాటి శరీరాలు కూడా సహకరించవు" అని ఘాటుగా కామెంట్ పెట్టి పెటా ఇండియా, పిఎంఓ ఇండియా, కేరళ టూరిజమ్, మనేకా గాంధీకి టాగ్ చేసింది. ఇక ఈ క్రూరమైన వీడియోకి నెటిజన్స్ కూడా ఘాటుగానే రిప్లయ్స్ ఇస్తున్నారు. "కర్మ దాని పని అది చేసుకుని వెళ్తుంది..టూరిస్టులను కూడా అనాలి. అసలు ఈ మనుషులేంటి మరీ ఇంత కఠినంగా తయారయ్యారు." అని మండిపడుతున్నారు.
కుక్కలంటే రష్మీకి బాగా ఇష్టం. వాటికి ఎక్కడైనా ఫుడ్ దొరక్కపోయినా వెంటనే అందుబాటులో ఉన్నవి పెడుతుంది. వాటిని ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటూ ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్ చేస్తుంది. తన ఇంట్లోకి తెచ్చుకుని పెంచుకుంటుంది. వాటికి గాయాలైతే ఆస్పత్రికి తీసుకెళ్తుంది. ఇలా మూగజీవాలంటే రష్మీకి పిచ్చి.