English | Telugu
జగతి మేడం గుండెలపై ఎగురుతున్న సీతాకోక చిలుక...ఎవరికోసమో మరి!
Updated : Feb 10, 2024
జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా వేసుకుంటుంది అని తెలుగులో ఒక కొంటె సామెత ఉంది. ఐతే ఇప్పుడు ఈ సామెతను కొంచెం ట్రెండ్ కి తగ్గట్టు మార్చితే వైట్ స్కిన్ టోన్ ఉన్న అమ్మ ఒంటి మీద ఏ టాటూ వేయించుకున్నా అందంగా ఉంటుంది అంటున్నారు అందాన్ని ఆరాధించేవాళ్ళు. మరి ఈ సామెత ఎవరి గురించి అనుకుంటున్నారా ఇంకెవరూ మీ , మా మనసు దోచేసిన గుప్పెడంత మనసు జగతి మేడం. అదేనండి అసలు పేరు జ్యోతి పూర్వజ్.. జ్యోతి తన అందంతో ఎంతోమంది మైండ్ ని బ్లాంక్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టే పిక్స్ కావొచ్చు ఫోటో షూట్స్ కావొచ్చు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయి.
అలాంటి జ్యోతి అలియాస్ జగతి మేడం ఇప్పుడు తన గుండెల మీద ఒక అందమైన రంగురంగుల ఎగిరే సీతాకోక చిలుకను టాటూగా వేయించుకుంది. టాటూ వేయించుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ భరిస్తే శరీరం మీద అంత అందమైన టాటూ ప్రాణం పోసుకుంటుంది. ఇక ఈ టాటూ వేస్తున్నంత సేపు జ్యోతి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు...కాసేపు బాధగా కాసేపు ఆనందంగా కాసేపు ఏడుపు ముఖంతో ఇలా ఆమె ముఖంలో నవరసాలను పండించింది..ఇక ఫైనల్ గా ఆ బటర్ ఫ్లై టాటూ పక్కన హోప్ అనే అక్షరాలను కూడా వేయించుకుంది.
ఫైనల్ లుక్ లో అమ్మడు బాడీ మీద అందమైన సీతాకోక చిలుక ఎగురుతున్నట్టుగా ఉంది. ఇక ఈ మొత్తాన్ని రీల్ గా చేసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకునేసరికి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. రీసెంట్ గా స్కూల్ స్టూడెంట్స్ పాడిన బటర్ ఫ్లై సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో మనకు తెలుసు కదా " బటర్ ఫ్లై , బటర్ ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్...నేను టాటూ ఆర్టిస్ట్ ని అవుతాను...అంత నొప్పిగా ఉన్నప్పుడు ఎందుకు టాటూ వేయించుకోవడం...బ్యూటిఫుల్ టాటూ..నేను కూడా సేమ్ ప్లేస్ లో వేయించుకున్నా...చాలా బాగుంది జగతి మేడం...అది చాలా సెన్సిటివ్ ఏరియా...ఇలాంటి టాటూస్ వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి పనులు చేయకండి." అంటూ కొందరు పొగుడుతూ ఉంటే కొందరు జాగ్రత్తలు చెప్తున్నారు.