English | Telugu
ఆది మంచి మనసుకు నెటిజన్స్ ఫిదా...
Updated : Feb 11, 2024
ప్రతీ శుక్రవారం నాడు కొత్త సినిమాలు రిలీజ్ చేసే ఆనవాయితీని మనం చూసాం..ఐతే ఇదే కాన్సెప్ట్ తో ప్రతీ మంగళవారం నాడు ఒక అక్రమ సంబంధాన్ని గోడ మీద రాసే ఒక కొత్త కాన్సెప్ట్ తో రీసెంట్ గా మంగళవారం అనే మూవీ సైలెంట్ గా వచ్చి మంచి హిట్ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో పాయల్ రాజపుత్ నటన పీక్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని స్పూఫ్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసేసింది. రీసెంట్ గా ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక గోడ మీద కొన్ని అక్రమ సంబంధాలను రాసిన హైపర్ ఆది డ్యాన్సులు చేస్తూ ఊళ్ళో అందరినీ పిలుస్తూ రచ్చ రంబోలా చేసాడు. "ఇమ్మానుయేల్ వర్ష మధ్య సంబంధం ఉంది, బులెట్ భాస్కర్ -ఢీ తేజస్విని, గడ్డం నవీన్ -మహతి, జిత్తు-స్వాతి మధ్య సంబంధాలు ఉన్నాయి..శాంతి స్వరూప్ కి అందరితో సంబంధం ఉంది" అని రాసి ఉంటుంది.
ఇక ఈ షోకి # 90s టీం వచ్చింది. నాటీ నరేష్ ని శివాజీ కర్ర తీసుకుని బాదేశాడు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తున్నావ్ కామెడీ ఎక్కడరా అంటూ తిట్టాడు. ఇక ఈ షోకి సోషల్ మీడియా సెలబ్రిటీ కుమారి ఆంటీని తీసుకొచ్చారు. "హాయ్ నాన్న అందరూ బాగున్నారా" అనే ట్రిక్ తో ఆంటీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అని అసలు రహస్యం చెప్పాడు ఆది. ఇక ఈ షోకి ఇండియన్ అథ్లెటిక్స్ లో 2022 లో బ్రాంజ్ మెడల్ తెచ్చిన మిస్ నందిని అగసర వచ్చింది. ఆమె కష్టాలు విన్న శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లంతా చలించిపోయారు. ఇంటి నిండా మెడల్స్ ఉన్నా తినడానికి తిండి లేదు అంటే చాలా బాధాకరమైన విషయం అంటూ ఆది తన ఈ వారం ఎపిసోడ్ పేమెంట్ ని నందినికి ఇస్తాను అంటూ ముందుకొచ్చాడు. తర్వాత ఇంద్రజ కూడా తన వంతు సాయం చేస్తానని చెప్పింది. ఇక తాగుబోతు రమేష్ కూడా ఈ వారం పేమెంట్ అందిస్తానని మాటిచ్చాడు. ఇలా నెక్స్ట్ వీక్ షోలో కొన్ని మంచి ఎలిమెంట్స్ తో ప్రసారం కాబోతోంది.