English | Telugu

సత్య, కృష్ణల కళ్యాణం జరగబోతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమైన సీరియల్స్ లలో 'ఎన్నెన్నో జన్మలబంధం' సీరియల్ కి ఒక క్రేజ్ ఉంది. ఇందులో వేద, యష్ ల జోడీకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. గుప్పెడంత మనసులో వసుధార-రిషి కాంబినేషన్ తర్వాత మళ్ళీ అంతటి పేరొచ్చింది వేద-యష్ ల జోడీకే అని చెప్పాలి. వీరిద్దరి కలిసి చేసిన ఆ సీరియల్ తొందరగా ముగిసింది. అయితే ఈ సీరియల్ అభిమానులు వీళ్ళ జంటని మళ్ళీ చూడాలని చాలాసార్లు కామెంట్లు చేశారంట. అందుకే వీరిద్దరి కలయికతో 'సత్యభామ' సీరియల్ మొదలైంది.

స్టార్ మా టీవీలో డిసెంబర్ 19 న రాత్రి 9:30 కి 'సత్యభామ' సీరియల్ ప్రారంభమైంది. అయితే ఇందులో క్రిష్ గా నిరంజన్, సత్యభామగా దెబ్జానీ మోదక్ నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ సత్యభామ(దెబ్జాని మోదక్) గా కొంచెం కోపంగా, అమ్మాయిలు పట్ల జరిగే, అన్యాయాలను ఎదిరించడానికి సత్యభామగా మన ముందుకు వచ్చేసింది. ఇక సత్యభామ వాళ్ళ నాన్న గొడవలకి ఎప్పుడు వెళ్ళొద్దంటూ బయపడుతూ సున్నితంగా ఉండాలని ఆలోచించే స్వభావం కలవాడు. సత్యభామ చెల్లెలు కాలేజీలో చదువుతుంటుంది. సత్యభామ ఎంబీఏ చదువు పూర్తి చేసుకొని గోల్డ్ మెడల్ తో ఇంటికొస్తుంది. ఇక సత్యభామ వాళ్ళ ఊరిలో జాతర సాగుతుంటుంది‌. అక్కడ ఒక రౌడీ సత్యభామని చూసి వల్గర్ గా మాట్లాడటంతో వాడి చెంప చెల్ళుమనిపిస్తుంది. ఇక అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి అమ్మాయిలను వేధిస్తున్నాడని వాడిని తీసుకెళ్తారు. ఆ గొడవ అంతా దూరంగా చూసిన సత్యభామ వాళ్ళ నాన్న కంగారుపడుతుంటాడు. నా కూతరుకి ఆ రౌడీ ఏ ఆపద తీసుకొస్తాడో ఏమోనని భయపడుతుంటాడు. ఇక అదే సమయంలో క్రిష్(నిరంజన్) తన ఫ్రెండ్స్ తో కలిసి జులాయిగా తిరుగుతూ, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. క్రిష్ వాళ్ళ నాన్న పెద్ద రౌడీగా పరిచయమవుతాడు. తనని నమ్మించి మోసం చేస్తే ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టని రౌడీలా క్రిష్ నాన్న పాత్రని తీర్చిదిద్దారు. మరి ఒక ఉద్యోగం అంటు ఏమీ లేని రౌడీ క్రిష్, ఎంబీఏలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న సత్యభామ ఎలా ప్రేమలో పడతారు? ఒకవేళ వాళ్ళు ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అనేది మిగతా కథ..

అయితే రానున్న ఎపిసోడ్ లలో సత్యభామ, క్రిష్ లు పెళ్ళి చేసుకోబుతున్నారంట. అయితే వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరి ఫ్యాన్స్ మాత్రం రానున్న ఎపిసోడ్ ల కోసం తెగ వెయిట్ చేస్తున్నారంట. మరి ఈ సీరియల్ ని మొదలై‌న నుండి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నవాళ్ళు.. ఈ సీరియల్ కథని ఇష్టపడ్డవాళ్ళు.. వేద, యశ్ ల కాంబినేషన్ మళ్ళీ స్క్రీన్ మీద చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నవాళ్ళెవరో కామెంట్ చేయండి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.