English | Telugu

గోల్డ్ రింగ్ కొన్న శ్రీకర్..త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్నాడు మరి!


బ్రహ్మముడి విలన్ శ్రీకర్ కి చాలా పెద్ద కష్టం వచ్చింది. తనకు గోల్డ్ రింగ్ తీసుకోవడం కోసం వాళ్ళ అమ్మా నాన్న కూడా తనతో గోల్డ్ షాప్ కి వెళ్లారు. ఐతే వాళ్ళ అమ్మ ఏమో దేవుడు బొమ్మ ఉన్న రింగ్ తీసుకోమని, వాళ్ళ నాన్న ఏమో ఫాషన్ డిజైన్ ఉన్న రింగ్ తీసుకోమని చెప్పడంతో ఎం చేయాలో అర్ధం కాక చాలా ఇబ్బంది పడినట్టు చెప్పాడు. చేసే పనిలో ఎలాంటి విజ్ఞాలు రాకుండా వినాయకుడి విగ్రహాన్ని తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ అమ్మ శ్రీకర్ కి సలహా ఇచ్చేసరికి సరే.. ఒకవేళ సాయిబాబా ఉంగరం పెట్టుకుంటే ఏమవుతుంది అని అడిగాడు. మరి అన్నయ్యకు ఎందుకు వెంకటేశ్వర స్వామి ఉంగరం తీసుకున్నావ్ అంటే వాడే ఒక వినాయకుడు కాబట్టి వెంకన్న రింగ్ తీసుకున్నావ్ కదా అని వాళ్ళ అమ్మతో కామెడీ చేసాడు శ్రీకర్. పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి అని వాళ్ళ అమ్మ చెప్పేసరికి శ్రీకర్ హార్ట్ టచింగ్ డైలాగ్ అంటూ అబ్బా ఎం చెప్పావ్ అమ్మా అన్నాడు.

ఆడియన్స్ కి అన్నయ్యని, వదినని, పిల్లను చూపించలేదు కదా త్వరలో వాళ్ళ హోమ్ టూర్ చేసి వాళ్ళు ఇంట్లో ఎంత డిసిప్లిన్ గా ఉంటారో చూపిస్తాను అని కౌంటర్ వేసేసరికి..నీకంటే వాళ్ళు డిసిప్లిన్ గా ఇంటిని నీట్ గా ఉంచుకుంటార్లే, ఐనా నువ్వు నీ ఫ్రెండ్స్ వల్లా ఇలా ఉన్నావ్ అని శ్రీకర్ మీద వాళ్ళ అమ్మ కౌంటర్ వేసింది. చివరికి డిజైనర్ రింగ్స్ ని పక్కన పెట్టేసి వినాయకుడి రింగ్ ని కొనేసాడు శ్రీకర్. ఎప్పటికైనా ఇంట్లో వాళ్ళు చెప్పిందే వినాలి కదా అన్నాడు. ఒక ఫంక్షన్ కి వెండి కుందులు తీసుకుంటున్నాం. అమ్మ గోల్డ్, సిల్వర్ కొన్నా ఇంకా ఏవో చూస్తూనే ఉంది. షాపింగ్ విత్ లేడీస్ అంటే ఇలాగే ఉంటుంది. నాన్నకు అలవాటైపోయింది కాబట్టి పట్టించుకోవడం లేదు. అసలు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కొనడానికి కారణం ఏమిటి అంటే త్వరలో తనను పెళ్లి కొడుకుని చేయబోతున్నారంటూ ఒక న్యూస్ చెప్పాడు. ఐతే నెటిజన్స్ మాత్రం "ఎందుకు శ్రీకర్ సస్పెన్సు లో పెడుతున్నావ్.. బహుశా ఒడుగు అయ్యి ఉంటుంది. గోల్డ్ రింగ్ చాల బాగుంది". అంటూ కామెంట్స్ చేస్తున్నారు.