English | Telugu
సుధీర్ ఫాన్స్ పై మండిపడ్డ బుల్లెట్ భాస్కర్...
Updated : Feb 28, 2024
సుడిగాలి సుధీర్ గురించి బుల్లితెర మీద ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అంత ఫేమస్ అయ్యాడు సుధీర్. అలాంటి సుధీర్ పరువు తీసేసాడు మరో కమెడియన్. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బులెట్ భాస్కర్ స్కిట్ లో సుధీర్ గురించిన ప్రస్తావన వచ్చింది. ఓ స్కిట్‌లో భాగంగా ఒక కమెడియన్ ' సుడిగాలి బాబు కాల్ చేస్తున్నాడు సార్' అని బులెట్ భాస్కర్ తో అనేసరికి 'వాడికి చిలక్కి చెప్పినట్లు చెప్పాను. ఫిబ్రవరి, మార్చి పెళ్లిళ్ల సీజన్‌రా.. చక్కగా మ్యాజిక్ షోలు చేసుకోరా.. ఈవెంట్‌కు రూ. 5 వేలు వస్తాయి" అని చెప్పాను అంటూ ఫన్నీ సెటైర్లు వేశాడు.
దీంతో యాంకర్ రష్మీతో పాటు అక్కడున్న వాళ్లంతా పకపకా నవ్వేశారు. ఆ తర్వాత భాస్కర్ తన మీదే తానే జోక్స్ వేసుకున్నాడు. 'ఈ స్కిట్ చూసి ఒరేయ్ బుల్లెట్ భాస్కర్ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా ? ఎవర్రా మీరంతా? ఒక్కొక్కరు నాలుగు మెయిల్ ఐడీలతో కామెంట్లు పెడితే భయపడతామా ? షకీలా సినిమా కింద మీకేం పనిరా? వి వాంట్ సుధీర్ అంటారా ? ఉదయం పూట జాతకాల ప్రోగ్రామ్‌లో సుధీరన్న సూపరూ అంటారు' అంటూ సుధీర్ ఫ్యాన్స్‌పై పంచ్‌లు వేశాడు. సుధీర్ జబర్దస్త్ షోలోకి రాకముందు మ్యాజిక్ షోలు చేస్తూ కెరీర్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.. మొదట్లో ఒక కమెడియన్ గా చిన్న స్కిట్స్ లో కనిపిస్తూ నెమ్మదిగా టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి తనదైన స్కిట్స్ తో ఆడియన్స్ అలరించడం మొదలుపెట్టారు. ఇదే టైములో యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. ఈ నేమ్ తోనే మూవీస్ లో నటించాడు సుధీర్. హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్', పండుగాడు, గాలోడు వంటి మూవీస్ తో దూసుకుపోతున్నాడు. ఇక ఈ షోలో ఇమ్ము-వర్ష స్కిట్ కొంచెం రొమాంటిక్ గా ఉంది. "ఇమ్ము చీమ కుట్టింది" అంటూ నడుము మీద చెయ్యి వేసి చెప్పేసరికి "నిన్ను కుట్టిన వారందరి పేర్లు చెప్పవ్ కానీ కుట్టిన చీమ పేరు చెప్తోందండి" అంటూ రొమాంటిక్ కౌంటర్ వేసేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఈ షోకి "మస్త్ షేడ్స్ ఉన్నాయ్ "మూవీ టీమ్ ప్రమోషన్స్ కోసం వచ్చి స్కిట్స్ లో పార్టిసిపేట్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.