English | Telugu

Guppedantha Manasu:మూడు నెలల గడువు అడిగిన వసుధార.. క్షమాపణ చెప్పి‌న ఫణీంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1012 లో.. వసుధారని మను తీసుకొని మహేంద్ర వాళ్ళ దగ్గరకి వస్తాడు. అక్కడ రిషికి మహేంద్ర కర్మకాండ నిర్వహిస్తుంటే వసుధార వచ్చి రిషి ఫోటో పక్కనే తన ఫోటో పెట్టి నాకు కూడా జరిపించండి అని అంటుంది. రిషి సర్ లేరంటే నేను కూడా లేనట్లే నాకు కూడా కర్మకాండ చెయ్యండని వసుధార ఎమోషనల్ అవుతుంది.

ఆ తర్వాత ఏంటి మేమేదో తప్పు చేస్తున్నట్లు మాట్లాడుతున్నావ్.. మేమ్ రిషి ఆత్మకి శాంతి కలగాలని చేసున్నామని దేవయాని అనగానే.. మీరు ఆపండి అని దేవయానిపై వసుధార అరుస్తుంది. ఆ తర్వాత మీరు తప్పు చేస్తున్నారు మావయ్య అని మహేంద్రతో వసుధార అంటుంది. నేను రిషి సర్ బ్రతికున్నాడని చెప్పిన కానీ మీరు వినట్లేదు.. రిషి సర్ బ్రతికే ఉన్నాడు నా మనసు చెప్తుందని వసుధార అంటుంది. ఆ తర్వాత మీకు ఇది ఎమోషనల్ కావచ్చు కానీ మీరు వసుధార మేడమ్ ని బాధ పెట్టి ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు. మేడమ్ రిషి సర్ ఉన్నారని నమ్ముతున్నారు.. అయిన మీరు రిషి సర్ చనిపోయాడని ఎలా నమ్ముతున్నారు.. ఎవరో వచ్చి రిపోర్ట్స్ చూపిస్తే నమ్మేస్తారా కొంచెం ఆలోచించండని వాళ్లతో మను అంటాడు.

నాకు ఒక మూడు నెలలు టైమ్ ఇవ్వండి రిషి సర్ ఎక్కడున్నా తీసుకొని వస్తాను. అంతవరకు ఇలాంటివేం చేయకండి అని వసుధార అందరిని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు చెప్తుంటే నాకు రిషి ఉన్నాడనిపిస్తుంది. నువ్వు తప్పకుండా తీసుకొని వస్తావనే నమ్మకం ఉందని ఫణీంద్ర అంటాడు. ఇంతవరకు వచ్చాక ఆపితే ఎలా అని శైలేంద్ర అంటాడు. అసలు నాకు ఇలా చెయ్యాలి అని ఐడియా ఇచ్చిందే నువ్వు అని శైలేంద్రపై ఫణీంద్ర కోప్పడతాడు. నువ్వు వద్దంటున్న వినకుండా ఇలా చేసాను.. సారి మహేంద్ర అని ఫణీంద్ర చెప్తాడు. మీరు వసుధారని బాధపెట్టే పని చేయకండి అని దేవయాని, శైలేంద్రలకి ఫణీంద్ర వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ప్లాన్ ఫెయిల్ అయిందని దేవయాని, శైలేంద్ర ఇద్దరు డిస్సపాయింట్ అవుతారు. నువ్వు నాతో పెట్టుకుంటున్నావ్ నీ సంగతి చెప్తానని మనుకి శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోమని శైలేంద్రకు మను కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.