English | Telugu

ఝాన్సీ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్.. ఏం ఉందంటే!

మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తుంటారు. ఒకేతల్లికి పుట్టిన పిల్లలే ఒకలే ఉండనప్పుడు ఎక్కడో‌ పుట్టి పెరిగి హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న కొందరు సెలబ్రిటీలు మరి భిన్నంగా ఉంటారు. అందులోను సీనియర్ యాంకర్ ఝాన్సీ.. నటిగా తనెకెన్ని గుర్తింపు లభించినా యాంకర్ గానే ఎక్కువ మందికి తెలిసింది.

ఫస్ట్ జనరేషన్ యాంకర్ ఝాన్సీ గురించి అందరికీ తెలుసు. ఆమె బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అలాంటి ఝాన్సీ రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో తన డ్రీమ్ హౌస్ ని బిల్డ్ చేస్తోంది. అయితే దానికోసం కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి వారి లోటస్ పాండ్ కి హస్తకళలని జోడిస్తున్నారు. అయితే సమాజంలో జరిగే ప్రతీ దానికి ఆమెకు వీలు కలిగినంతలో స్పందిస్తుంటుంది.

కొంతకాలం క్రితం రిలీజైన సలార్ లో ఆమె ఓబులమ్మగా నటించి మెప్పించారు. ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన మిస్ పర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక తను ఇన్ స్టాగ్రామ్ లో 290K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. తను‌ ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే మొదట 'సొంతం' మూవీలో సునీల్ తో‌ కలిసి చేసిన ఆ కామెడీ వీడియోలు, మాటలు, పంచ్ లు అన్నీ ఇప్పటికీ ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ లో కన్పిస్తుంటాయి. ఇక ఝాన్సీ తాజాగా వితౌట్ మేకప్ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఆ పోస్డ్ కి .. " నో మేకప్ ఈజ్ బెస్ట్ మేకప్.. సింపుల్ క్యారెక్టర్స్. అండ్ సింపుల్ కాటన్ సారీస్ ఆర్ ది సింప్లీ ది బెస్ట్" అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అంటే ముఖానికి ఏ మేకప్ లేకుంటేనే బాగుంటామని, అందులోను సింపుల్ కాటన్ చీరలలో మరీ అందంగా కన్పిస్తామని ఝాన్సీ ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చింది. ఇలా సింప్లిసిటీతో పాటు సంప్రదాయాలని కాపాడుకుంటూ వస్తున్న ఝాన్సీ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఝాన్సీ నటించిన సినిమాలలో మీ ఫెవరట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.