English | Telugu
Brahmamudi : నేనెందుకు విడాకులు తీసుకోవాలని అత్తని నిలదీసిన కోడలు!
Updated : May 27, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -420 లో.....కావ్య ఇంటికి రాగానే.. ఏంటి వచ్చావా మళ్ళీ ఏం ప్రాబ్లమ్ తీసుకొస్తావో.. ఎక్కడికి వెళ్ళావని రాజ్ అడుగుతాడు. మాయని తీసుకొని వచ్చి పెట్టావని రాజ్ కోప్పడతాడు. అది నీ గదిలోకి రాకుండా చూసుకో.. మీ శీలం మీరు కాపాడుకోండి అని కావ్య వెటకారంగా మాట్లాడి వెళ్తుంది.
ఆ తర్వాత అపర్ణ లాయర్ కి ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి చెప్పి.. నేను చెప్పినట్టు పేపర్స్ రెడీ చేసుకొని ప్రొద్దున రమ్మని లాయర్ తో అపర్ణ చెప్తుంది. మీరు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా అని లాయర్ అంటాడు. నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ముందు నేను చెప్పినట్టు వినండి అని అపర్ణ అంటుంది. మరుసటి రోజు అపర్ణ హాల్లో కి అందరిని పిలుస్తుంది. అప్పుడే ఇంటికి లాయర్ వస్తాడు. అతను తెచ్చిన పేపర్స్ తీసుకొని లాయర్ ని వెళ్లిపోమ్మంటుంది. అవి ఏంటని సుభాష్ అడుగుతాడు. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంటి భవిష్యత్తుని నిర్ణయించే పేపర్స్ విడాకుల పత్రాలు అని అనగానే.. ఇంట్లో అందరు షాక్ అవుతారు. విడాకులా ఆ మాట ఎవరి నోటా వినపడద్దని మీ మావయ్య చెప్పారు కదా అని ఇందిరాదేవి అంటుంది. కానీ తప్పడం లేదని అపర్ణ అంటుంది. ఎవరికి తప్పడం లేదని ఇందిరాదేవి అడుగుతుంది. తప్పటడుగులు వేసిన వాళ్ళకి అని.. నీ గురించే అని రాజ్ కి చెప్తుంది. కావ్య, నువ్వు విడాకులు తీసుకోవాలని రాజ్ తో అపర్ణ అనగానే.. అందరు షాక్ అవుతారు. నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావని ఇందిరాదేవి అడుగుతుంది. ఆ బాబు మాయకి పుట్టిన బాబు ఈ ఇంటి వారసుడు.. మాయని రాజ్ పెళ్లి చేసుకోవాలి. అలా పెళ్లి చేసుకోవాలంటే కావ్యకి విడాకులు ఇవ్వాలని అపర్ణ అంటుంది.
ఆ తర్వాత ఒకరికి న్యాయం చెయ్యాలంటే ఇంకొరికి అన్యాయం చెయ్యాలా అని అపర్ణని సుభాష్ అడుగగా... ఇంతకంటే ఏం చేస్తావ్? ఆ మాయకి ఎలా న్యాయం చేస్తారని అపర్ణ అంటుంది. మా తర్వాత ఈ కుటుంబం సమర్ధవంతంగా నడపగలవని బాధ్యతలు నీకు అప్పాజెప్పాము.. కానీ కావ్యకి విడాకులు ఇవ్వాలని చెప్పడానికి నువ్వు ఎవరు? ఏం అధికారం ఉందని అపర్ణని సీతారామయ్య అడుగుతాడు. అసలు కావ్య, రాజ్ లని అడిగావా? కావ్య నీకు రాజ్ నుండి విడిపోవడం ఇష్టమేనా అని ఇందిరాదేవి అడుగుతుంది. నేను ఇప్పుడు మా అత్తగారిని కొన్ని అడగాలి.. నేను ఇష్టం లేకనే అలా మాయని ఇష్టపడ్డారన్నారు కదా.. ఆ మాయ రెండు సంవత్సరాల కింద పరిచయమైతే మీ అబ్బాయి మా అక్కని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయి.. నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు.. అది నా తప్పేనా.. నాకు ఈ విడాకులు ఇష్టం లేదని కావ్య చెప్తుంది. తరువాయి భాగంలో.. థాంక్స్ విడాకులు ఇవ్వనన్నావ్ కదా అని కావ్యతో రాజ్ అంటాడు. అంటే నేను వెళ్లిపోతానని భయపడ్డారా.. మరి మీరు ఎందుకు విడాకులు అనగానే సైలెంట్ గా వచ్చారని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.