English | Telugu

గుప్పెడంత మనసులోకి రిషి వచ్చేస్తున్నాడు.. ఇది పక్కా అఫీషియల్!

నేడే విడుదల.. తాజా వార్తా.. సర్ ప్రైజ్ అలర్ట్.. ఇలా పేరేదైనా.. ఆ థ్రిల్ వేరే లెవెల్ లో ఉంటుంది. బుల్లితెర ధారావాహికలని అభిమానించే ప్రేక్షకులకి గుప్పెడంత మనసు సీరియల్ మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అది ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయాన్ని స్టార్ మా నేరుగా చెప్పకుండా.. సర్ ప్రైజ్ అలర్ట్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ని చేసింది. కాలేజ్‌కి అతనో యంగ్ డైనమిక్ ఎండీ. భార్యని, ఫ్యామిలీని స్టూడెంట్‌ని ప్రేమిస్తుంటాడు. ఆ వ్యక్తిని వాళ్లంతా మిస్ అయ్యారు. అతని రాక కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.. అతనెవరో గెస్ చేయండి అంటు స్టార్ మా ఆ పోస్ట్ లో తెలిపింది.. ఇన్ని క్లూలు ఇచ్చిన తరువాత.. అతనెవరో తెలియకుండా ఉంటుందా.. అతనెవరో కాదు.. రిషీనే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గత ఐదు నెలలుగా రిషి రాక కోసం ఎదురుచూస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంతకు రిషి కోసమేనా.. ఈ పోస్ట్ అనే సందేహం లేకుండా చేశాడు ముఖేష్ గౌడ. స్టార్ మా పెట్టిన ఈ పోస్ట్‌ పై ముఖేష్ గౌడ స్పందిస్తూ.. ఎనీ క్లూ అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో ఇది ఖచ్చితంగా మనోడి రీఎంట్రీ గురించేనని తేలిపోయింది.

రిషి పాత్రలో ముఖేష్ గౌడ కాకుండా వేరే కొత్త క్యారెక్టర్‌ని తీసుకుని వస్తున్నారా అనే సందేహాలు కూడా రావొచ్చు కానీ.. తాజా పోస్ట్‌పై ముఖేష్ గౌడ కామెంట్ చేశాడు కాబట్టి కచ్చితంగా మళ్లీ రిషి పాత్రలో ముఖేష్ గౌడనే రీఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మను తండ్రి ఎవరో కాదు మహేంద్రే అని తెలిస్తే మను పాత్రతో పెద్దగా పని ఉండదు. కాబట్టి మను కథకి అలా ముగింపు పలికి రిషి-వసుధారల ప్రేమకథని కొనసాగిస్తారు కావచ్చు. ఎనీ వే రిషి వస్తున్నాడని ఈ సీరియల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.