English | Telugu

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 కాస్త ముందుగా.. ఎప్పుడు? ఎక్కడ? ఎవరెవరు?

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది.‌ సీజన్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. సీజన్ సెవెన్ సూపర్ హిట్ అవ్వడంతో సీజన్ 8 ఎప్పుడు ఉండబోతుందా అనే క్యూరియాసిటి అందరిలోను ఉంది.

సాధారణంగా బిగ్ బాస్ సెప్టెంబరులో ఉంటుందని అనుకున్నారంతా.. కానీ ఈసారీ‌ కాస్త మూడు నెలల ముందుగా అంటే జూలై రెండవ వారంలో‌ గానీ చివరి వారంలో గానీ మొదలవుతుందంట. ఇందుకు గాను బిగ్ బాస్ సెట్ వర్క్ పనులు కూడా మొదలయ్యాయని టాక్. అయితే సారీ ఎందుకు ముందు ఉంటుందంటే. జూన్ నెల మొత్తం క్రికెట్ టీ20 వరల్డ్ కప్ ఉంది.‌ అందువల్ల టీఆర్పీ ని దృష్టిలో పెట్టుకొని జూలైలో గ్రాంఢ్ గా లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సీజన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరుండే ఛాన్స్ ఉందో ఓసారి చూసేద్దాం.

ఇన్ స్ట్రాగ్రామ్ , ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి కొంతమంది సెలెబ్రిటీలని ఈ సారి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. బర్రెలక్క, ఫార్మర్ నేత్ర, కుమారీ ఆంటీలు కచ్చితంగా ఉంటారనే వార్తలు వినపిస్తున్నాయి.‌ జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినటువంటి కిరాక్ ఆర్పీ కూడా బిగ్ బాస్ 8 లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గత సీజన్ సెవెన్ కి చివరి నిమిషంలో రాలేకపోయిన కొంతమంది సెలెబ్రిటీలను కూడా బిబి టీమ్ అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ‌ఇక బిబి టీమ్ కంటెస్టెంట్స్ ఎంపికని శరవేగంగా చేస్తుందని, సెట్ వర్క్ కూడా సాగుతుందని తెలుస్తుంది. మరో రెండు నెలల్లో బిగ్ బాస్ ప్రారంభం అవుతుందని సమాచారం. ‌మరి ఈ సీజన్ 8 లోకి ఎవరు వస్తే బాగుంటందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.