English | Telugu

Karthika Deepam2 : కార్తిక్ తండ్రి లవర్ కావేరి.. ఆ గుట్టుని దీప బయటపెట్టనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -55 లో.. దీప తన పేరెంట్స్ కి పిండం పెడుతుంది. ఆ పిండాన్ని కాకులు కూడా ముట్టవ్.. అప్పుడే ఒకతను వచ్చి బ్రతికున్న వాళ్ళకి పిండం పెడితే అవి ఎలా ముడుతాయని చెప్తాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఏంటి మీరనేది.. అమ్మనాన్న ఎప్పుడో చనిపోయారని దీప అనగానే.. లేదు బ్రతికే ఉన్నారు. అందుకే ముట్టడం లేదని అతను అంటాడు. అప్పుడే అనసూయ అన్న మాటలని దీప గుర్తుకుచేసుకొని.. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటుంది‌. ముందు ఈ కార్యక్రమం అయిపోవాలని దీప అనుకుంటుంది.

మరొకవైపు కార్తీక్ తో శ్రీధర్ మాట్లాడాలని అంటాడు. ఏంటని కార్తీక్ అడుగుతాడు. అసలు దీపకి నీకు సంబంధం ఏంటని అడుగుతాడు. దీప ఇక్కడకి వచ్చే కంటే ముందే నీకు తెలుసా అని శ్రీధర్ అడుగుతాడు. అంటే వాళ్ళ ఊళ్ళో జాతరకి గెస్ట్ గా వెళ్ళాను. తను పోటీలో సైకిల్ గెలుచుకుంటే అది ఇచ్చానని కార్తీక్ చెప్తాడు. చూసేవాళ్ళు అలా అని అనుకుంటారా అని శ్రీదర్ అడుగుతాడు. వాళ్ళు ఆలోచించే తీరుని బట్టి ఉంటుందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ వెళ్ళిపోతాడు. అసలు ఎందుకు వీడు ఇలా అనుకుంటున్నాడని శ్రీధర్ అనుకుంటాడు. మరొక వైపు దీప హోటల్ లో స్పెషల్ అంటూ బిర్యానీ ఉప్మా రెడీ చేస్తుంది. అక్కడికి శ్రీధర్ లవర్ కావేరి ఇంక తన ఫ్రెండ్స్ వస్తారు. అక్కడ కడియంకి కావేరికి గొడవ జరుగుతుంది‌. కడియంపై కావేరి చెయ్ చేసుకోబోతుంటే దీప ఆపుతుంది. నువ్వు నీ బేబీని పిలువు వీళ్ళ సంగతి చెప్తాడని తన ఫ్రెండ్స్ అనగానే.. కావేరి శ్రీధర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. ఎవరు నీతో గొడవ పడిందని శ్రీధర్ ఆవేశంగా వచ్చి అడుగుతాడు. వాళ్లే బేబీ అంటూ కావేరి.. దీప వాళ్లని చూపిస్తుంది. దీపని చూడగానే శ్రీధర్ షాక్ అవుతాడు. మీరు ముందు ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ కావేరి వాళ్ళని పంపిస్తాడు శ్రీధర్.

ఆ తర్వాత దీప దగ్గరికి శ్రీధర్ వచ్చి.. ఈ విషయం ఎవరికి చెప్పకని అంటాడు. కాంచన గారు మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు. ఇలా చెయ్యడం కరెక్టే కాదని దీప చెప్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పకంటూ శ్రీధర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీధర్ ఇంటికి వెళ్లేసరికి కాంచన కోపంగా ఉంటుంది. దీప నిజం చెప్పిందేమోనని శ్రీధర్ బయపడుతాడు కానీ న్యూస్ లో సేమ్ దీపకి జరిగినట్టే ఒకావిడకి అన్యాయం జరిగిందంటూ చెప్తుంది. ఆ తర్వాత కాంచనకి దశరథ్ కాల్ చేసి.. రేపు అందరు ఇంటికి రండి.. బావతో మాట్లాడాలని అంటాడు. తన లవర్ గురించి అడుగుతాడేమోనని శ్రీధర్.. నేను రాను నాకు పని ఉందని అంటాడు. నీతో మాట్లాడాలంటే రానంటావేంటని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.